కొన్ని పాములు చూడటానికి సాధారణంగా కనిపించినా, వాటి విషం మాత్రం ప్రాణాంతకంగా ఉంటుంది. ఒక్క కాటు మనిషి జీవితం మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అలాంటి అత్యంత ప్రమాదకరమైన 5 పాముల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా అనేక జాతుల పాములు ఉన్నప్పటికీ, వాటిలో కొన్ని మాత్రమే అత్యంత విషపూరితమైనవి. ఈ పాములు కాటు వేస్తే.. టైంకి వైద్య సహాయం అందకపోతే ప్రాణాలకు ముప్పు తప్పదు. కాబట్టి వాటి గురించి అవగాహన ఉండటం చాలా అవసరం. ఇక్కడ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన 5 పాముల గురించి తెలుసుకుందాం.
ఇన్ ల్యాండ్ తైపాన్
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పాముల్లో మొదటగా చెప్పుకోవాల్సింది ఇన్ ల్యాండ్ తైపాన్. దీన్ని “ఫియర్స్ స్నేక్” అని కూడా అంటారు. ఇది ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. దీని విషం చాలా పవర్ ఫుల్. ఒకే కాటుకు వందల మందిని చంపే సామర్థ్యం ఉంటుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇది చాలా అరుదుగా మనుషులపై దాడి చేస్తుంది.
25
కింగ్ కోబ్రా
ప్రపంచంలోనే అతి పొడవైన విషపాము కింగ్ కోబ్రా. ఇది ప్రధానంగా భారత్, దక్షిణాసియా ప్రాంతాల్లో కనిపిస్తుంది. కింగ్ కోబ్రా విషం న్యూరోటాక్సిక్‌గా పనిచేస్తుంది. అంటే ఇది నరాల వ్యవస్థను ప్రభావితం చేసి శ్వాసను ఆపేయగలదు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది తన గూడు, గుడ్లను రక్షించుకోడానికి చాలా అగ్రెసివ్ గా మారుతుంది.
35
బ్లాక్ మాంబా
మరో ప్రమాదకర పాము బ్లాక్ మాంబా. ఇది ఆఫ్రికాలో కనిపిస్తుంది. అత్యంత వేగంగా కదిలే పాముల్లో బ్లాక్ మాంబా ఒకటి. దీని విషం చాలా వేగంగా ప్రభావం చూపుతుంది. చికిత్స లేకపోతే కొన్ని గంటల్లోనే ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది. బ్లాక్ మాంబా దాడి చేసినప్పుడు వరుసగా అనేక సార్లు కాటు వేయగలదు. అందుకే ఇది అత్యంత ప్రమాదకరమైన పాముగా చెప్తారు.
ఈ పాము చూడ్డానికి చిన్నగా ఉన్నప్పటికీ, అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఒకటి. ఇసుక పింజరి భారతదేశం సహా ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో కనిపిస్తుంది. దీని విషం రక్తం గడ్డకట్టే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ పాము కాటు మరణాలకు ఈ పామే కారణమని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది చాలా వేగంగా స్పందించే పాము, చిన్న శబ్దానికి కూడా దాడి చేసే స్వభావం కలిగి ఉంటుంది.
55
రక్తపింజరి
భారతదేశంలో ఎక్కువగా కనిపించే అత్యంత విషపూరితమైన పాములలో రక్తపింజరి ఒకటి. దీని కాటు చాలా తీవ్రమైన నొప్పి, వాపు, అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే ప్రాణాంతకమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో పనిచేసే వారికి ఈ పాము కాటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.