Smart TV Cleaning: స్మార్ట్ టీవీ క్లీన్ చేస్తున్నారా? దీనితో క్లీన్ చేస్తే టీవీ కొత్తదానిలా మెరిసిపోతుంది

Published : Apr 29, 2026, 06:02 PM IST

Smart TV Cleaning: స్మార్ట్ టీవీ క్లీన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. చిన్న పొరపాటు చేసినా.. వేల రూపాయలు ఖర్చు చేసి కొన్న టీవీ… డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.   

PREV
17
స్మార్ట్ టీవీ శుభ్రం చేసేదెలా?

ఈ రోజుల్లో ఒక స్మార్ట్ టీవీ కొనాలంటే రూ. లక్ష అయినా కావాల్సిందే. మరింత అంత ఖర్చు చేసి  కొన్న టీవీని  చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. ముఖ్యంగా  మనం ఆ టీవీ ని క్లీన్ చేసేటప్పుడు తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు చేయడం వల్ల  టీవీ స్క్రీన్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. టీవీ స్క్రీన్  చాలా సున్నితంగా ఉంటుంది. చాలా మంది దుమ్ము దులపడానికి పాత దుస్తులు లేదా కెమికల్స్ వాడితే, మీ టీవీ పిక్చర్ క్వాలిటీ తగ్గడమే కాకుండా,  స్క్రీన్ మొత్తం గీతలు పడే ప్రమాదం ఉంది.

27
టీవీ శుభ్రం చేసేటప్పుడు చేయకూడని పొరపాట్లు...

శాశ్వత గీతలు.. గరుకుగా ఉండే క్లాత్ లేదా పేపర్ టవల్ వాడితే స్క్రీన్ పై చిన్న చిన్న గీతలు పడతాయి.

కోటింగ్ డ్యామేజ్…  స్మార్ట్ టీవీలపై  యాంటీ గ్లేర్ కోటింగ్ ఉంటుంది. విండో క్లీనర్ లేదా ఆల్కహాల్ వాడితే ఈ కోటింగ్ పోతుంది.

సర్క్యూట్ డ్యామేజ్: స్క్రీన్‌పై నేరుగా నీళ్లు లేదా లిక్విడ్ స్ప్రే చేస్తే, అది అంచుల నుంచి లోపలికి వెళ్లి షార్ట్ సర్క్యూట్ కావచ్చు.

పిక్సెల్ డెత్: గట్టిగా ఒత్తిడి పెట్టి తుడిస్తే లోపల ఉండే పిక్సెల్స్ (Pixels) దెబ్బతిని స్క్రీన్‌పై నల్లటి చుక్కలు ఏర్పడవచ్చు.

37
స్మార్ట్ టీవీ శుభ్రం చేయడానికి 5 సింపుల్ టిప్స్:

ఏ ఎలక్ట్రానిక్ వస్తువునైనా శుభ్రం చేసే ముందు, దాన్ని స్విచ్ ఆఫ్ చేసి, సాకెట్ నుంచి ప్లగ్ తీసేయడం  చాలా ముఖ్యం. టీవీ ఆన్‌లో ఉన్నప్పుడు స్క్రీన్ వేడిగా ఉంటుంది, అప్పుడు లిక్విడ్ వాడితే మరకలు పడతాయి. అంతేకాకుండా, నల్లటి స్క్రీన్‌పై దుమ్ము, మరకలు స్పష్టంగా కనిపిస్తాయి.

47
2. మైక్రోఫైబర్ క్లాత్ మాత్రమే వాడండి:

సాధారణ బట్ట, టవల్ లేదా టిష్యూ పేపర్‌కు బదులుగా కేవలం 'మైక్రోఫైబర్' (Microfiber) క్లాత్‌ను మాత్రమే ఉపయోగించండి. ఇది చాలా మృదువుగా ఉండి, దుమ్మును బాగా పీల్చుకుంటుంది. స్క్రీన్‌పై ఎలాంటి గీతలు పడకుండా చేస్తుంది. కళ్లజోడు లేదా ల్యాప్‌టాప్ శుభ్రం చేయడానికి వాడే క్లాత్‌ను కూడా మీరు వాడొచ్చు.

57
3. లిక్విడ్‌ను నేరుగా స్క్రీన్‌పై స్ప్రే చేయవద్దు:

ఏ క్లీనింగ్ లిక్విడ్ లేదా నీటిని నేరుగా టీవీ స్క్రీన్‌పై స్ప్రే చేయకండి. ముందుగా మైక్రోఫైబర్ క్లాత్‌పై కొద్దిగా లిక్విడ్ చల్లి, ఆ తర్వాత ఆ బట్టతో సున్నితంగా స్క్రీన్‌ను తుడవండి.

67
4. సరైన క్లీనర్‌ను ఎంచుకోండి:

సబ్బు నీళ్లు, విండో క్లీనర్ (ఉదాహరణకు కోలిన్), ఆల్కహాల్ లేదా అమ్మోనియా ఉన్న ద్రావణాలను అస్సలు వాడొద్దు. స్క్రీన్ క్లీనింగ్ కోసం ప్రత్యేకంగా లభించే కిట్ లేదా డిస్టిల్డ్ వాటర్ (Distilled Water) వాడండి. క్లాత్ మరీ తడిగా కాకుండా, కేవలం తేమగా ఉంటే చాలు.

77
5. చాలా తక్కువ ఒత్తిడి పెట్టండి (Gentle Pressure):

టీవీ స్క్రీన్ తుడిచేటప్పుడు వేళ్లతో గట్టిగా నొక్కవద్దు. గుండ్రంగా లేదా ఒకే దిశలో (పై నుంచి కిందికి) సున్నితంగా తుడవండి. శుభ్రం చేసిన వెంటనే టీవీ ఆన్ చేయకండి. స్క్రీన్ పూర్తిగా ఆరిన తర్వాతే స్విచ్ ఆన్ చేయాలి.

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే మీ స్మార్ట్ టీవీని కొత్తదానిలా చాలాకాలం కాపాడుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories