క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ సూపర్ ఫుడ్స్ ప్రతిరోజూ తినాల్సిందే

Published : Oct 31, 2025, 04:27 PM IST

Prevent cancer: క్యాన్సర్ ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య.  శరీరంలోని కణాలు నియంత్రణ లేకుండా అపరిమితంగా పెరిగి క్యాన్సర్ గా మారుతుంది. క్యాన్సర్ రాకుండా జాగ్రత్తపడాలంటే ముందుగా కొన్ని రకాల సూపర్ ఫుడ్స్ తినాలి.

PREV
19
ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్

క్యాన్సర్ భయంకరమైన వ్యాధి. ఇది ఒక్కసారి వస్తే జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది.  శరీరంలో కొన్ని చోట్ల కణాలు నియంత్రణ లేకుండా పెరిగి కణితిల్లా ఏర్పడతాయి. ఆ కణితిలే క్యాన్సర్ గా మారుతాయి. ఇది ఒకచోట ఏర్పడి ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. క్యాన్సర్ రాకుండా అడ్డుకోవాలంటే కొన్ని రకాల ఆహారాలను తప్పకుండా తినాలి. అలాంటి సూపర్ ఫుడ్స్ ఇక్కడ ఇచ్చాము.

29
బ్రోకలీ

బ్రోకలీ సూపర్ ఫుడ్. దీనిలో సల్ఫోరాఫేన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదలకు అంతరాయం కలుగుతుంది. సల్ఫోరాఫేన్ రొమ్ము, ప్రోస్టేట్, పెద్దప్రేగు క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.

39
పసుపు

పసుపులో కర్కుమిన్‌ ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదిస్తుంది. రొమ్ము, ప్రోస్టేట్, ఊపిరితిత్తుల, పెద్దప్రేగు క్యాన్సర్లకు కర్కుమిన్ బాగా పనిచేస్తుంది.

49
బెర్రీలు

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్బెర్రీ, బ్లాక్బెర్రీలలో ఆంథోసైనిన్లు, ఎలాజిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లు. ఇవి కణాలను డీఎన్ఏ దెబ్బతినకుండా కాపాడతాయి. క్యాన్సర్ కణాల వ్యాప్తిని నెమ్మదిస్తాయి.

59
వెల్లుల్లి

వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వెల్లుల్లిని రోజూ తినడం వల్ల కడుపు, పెద్దప్రేగు, ప్రోస్టేట్ క్యాన్సర్ల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

69
గ్రీన్ టీ

గ్రీన్ టీలో కాటెచిన్స్ ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు. ఇవి కణాల నష్టాన్ని నివారించి, క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదిస్తాయి. గ్రీన్ టీ తాగడం వల్ల రొమ్ము, కాలేయం, ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది.

79
టమోటాలు

టమోటాలకు ఎరుపు రంగును ఇచ్చే లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

89
నట్స్

వాల్‌నట్స్, బాదం, బ్రెజిల్ నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, సెలీనియం, పాలీఫెనాల్స్ ఉంటాయి. వీటికి క్యాన్సర్ నిరోధక గుణాలున్నాయి. పెద్దప్రేగు, రొమ్ము, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ల ప్రమాదాన్ని నట్స్ తగ్గిస్తాయి.

99
ఆకుకూరలు

ఆకుకూరలలో ఫోలేట్, కెరోటినాయిడ్లు, ఫైబర్ ఉంటాయి. ఇది డీఎన్ఏ దెబ్బతినకుండా కాపాడి, కణితుల పెరుగుదలను నెమ్మదిస్తుంది. రొమ్ము, చర్మం, కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి ప్రభావవంతంగా పనిచేస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories