Banana Storage tips: అరటి పండ్లు కొన్నాక అవి రెండు మూడు రోజులకే నల్ల మచ్చలతో పూర్తిగా పండిపోతాయి. అలా పూర్తిగా పండిన అరటి పండ్లను తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడరు. ఇలా మచ్చలు రాకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలి అంటే చిన్న చిన్న చిట్కాలు పాటించాలి.
ఎక్కువమంది తినే పండ్లలో.. అలాగే ఇష్టపడే పండ్లలో అరటిపండు కూడా ఒకటి. ఇది చాలా రుచిగా ఉండడమే కాదు, ఆరోగ్యానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది. కాకపోతే అరటి పండ్లు త్వరగా పండిపోతాయి. వాటిని సరైన విధంగా నిల్వ చేయకపోతే రెండు మూడు రోజుల్లోనే నల్లగా మారి మెత్తగా అయిపోతాయి. దీనివల్ల ఎన్నోసార్లు అరటిపండ్లు వృధాగా పడేయాల్సి వస్తుంది. అరటి పండ్లను ఎక్కువ రోజులు పాటు తాజాగా నిల్వ ఉంచాలంటే కొన్ని సులభమైన చిట్కాలు పాటించాలి.
24
ఎథిలీన్ వాయువు వల్ల
ఎప్పుడూ అరటిపండ్లను విడిగానే ఉంచాలి. ఇతర పండ్లతో కలిపి ఉంచకూడదు. యాపిల్, టమాట వంటి వాటితో కలిపి ఉంచిన వాటి పక్కన ఉంచితే.. వాటి నుండి వచ్చే ఎథిలీన్ అనే వాయువు ఈ పండ్లను త్వరగా పండేలా చేస్తుంది. దీనివల్ల అరటి పండ్లు త్వరగా నల్లబడతాయి. అరటిపండ్లను ఫ్రిడ్జ్ లో పెట్టడం కూడా మంచిది కాదు. చాలామంది పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని ఫ్రిడ్జ్ లో ఉంచుతారు. ఫ్రిడ్జ్ లో ఉంచితే వాటితో ఒక్క త్వరగా నల్లబడే అవకాశం ఉంది. అందుకే అరటిపండ్లను గది ఉష్ణోగ్రత వద్ద గాలి వెలుతురు వచ్చేలా ఉంచాలి.
34
అల్యూమినియం ఫాయిల్
అరటిపండ్లను కాడను ప్లాస్టిక్ లేదా అల్యూమినియం ఫాయిల్ తో చుట్టి ఉంచడం వల్ల కూడా అరటి పండ్లు ఎక్కువ రోజులు పండకుండా ఉంటాయి. సాధారణంగా అరటిపండు కాడల నుంచి కూడా ఎథిలీన్ వాయువు విడుదలవుతుంది. కాడను ఎప్పుడైతే అల్యూమినియం ఫాయిల్ తో చుట్టాము. ఆ వాయువు బయటికి రావడం తగ్గుతుంది. దీనివల్ల అరటి పండ్ల త్వరగా నల్లగా, మెత్తగా కాకుండా ఉంటాయి.
మరొక సులభమైన పద్ధతి ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో వాడుతున్న పద్ధతి.. అరటి పండ్లను గాలిలో వేలాడదీయడం. చాలా మంది పండ్లను గిన్నెలో లేదా ప్లేటులో ఉంచుతారు. అలా ఉంచితే పండ్లు ఒకదానికి ఒకటి రాసుకుని ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల త్వరగా నల్ల మచ్చలు వస్తాయి. కాబట్టి అరటిపండ్ల స్టాండ్ ఒకటి కొని.. దానికి అరటి పండ్లను గాలిలో వేలాడదీసినట్టు పెట్టాలి. లేదా తాడు కట్టి ఏదైనా కొక్కేనికి వేలాడదీసిన మంచిదే. పండ్లు త్వరగా పాడవకుండా ఉంటాయి. అందుకే బయట అరటి పండ్లు గెలలు కూడా తాడుతో కట్టి వేలాడదీసి అమ్ముతారు.
అరటి పండ్లు కొనేటప్పుడే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. పూర్తిగా పసుపు రంగులో ఉన్న పండ్లను కొనుగోలు చేస్తే అవి త్వరగా పక్వానికి వస్తాయి. అందుకే కాస్త ఆకుపచ్చగా ఉన్నవి తీసుకోవడం మంచిది.