Kasuri methi: ఏడాదంతా నిల్వ ఉండేలా కసూరి మేతిని ఇంట్లోనే ఇలా తయారు చేసేయండి

Published : Mar 13, 2026, 04:57 PM IST

Kasuri methi: ప్రతి ఇంట్లోనూ కసూరి మేతిని వాడతారు. కానీ మార్కెట్ నుంచి కొని తెచ్చుకునే వాడతారు. నిజానికి దీన్ని ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి చేసుకుంటే ఏడాదంతా నిల్వ ఉంటుంది. 

PREV
14
కసూరి మేతి తయారీ

కసూరి మేతి వేస్తే ఏ కూర అయినా మరింత రుచిగా మారుతుంది. కసూరి మేథిని ఎక్కువ మంది కొంటూ ఉంటారు. వాటిని కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కసూరి మేథిని తయారు చేసుకోవచ్చు. కసూరి మేతి అంటే ఎండబెట్టిన మెంతి ఆకులు. భారతీయ వంటకాల్లో మంచి సువాసనను, రుచిని అందించేందుకు వీటిని వాడతారు. కసూరి మేతిని ఇంట్లోనే ఆరోగ్యకరంగా, శుచిగా తయారు చేసుకుంటే ఏడాది పాటు నిల్వ ఉంటుంది. ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.

24
తాజా మెంతి ఆకులతో...

కసూరి మేతి తయారు చేయడానికి ముందుగా తాజా మెంతి ఆకులను కొనాలి. ఆకులు పసుపు రంగులోకి మారినవి లేదా పాడైనవి ఉంటే ఏరి పారేయాలి. తర్వాత మెంతు ఆకులను కాడల నుంచి వేరు చేసి శుభ్రంగా నీటిలో వేసి బాగా కడుక్కోవాలి. ఎందుకంటే ఆకులకు మట్టి, దుమ్ము ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండు మూడు సార్లు నీటితో శుభ్రం చేయాలి. ఆ తర్వాత జల్లెడలో ఆ నీటిని వడకట్టి ఆకులను వేరు చేయాలి. లేదా ఒక కాటన్ క్లాత్ లో ఈ ఆకులు అన్నింటినీ వేసి గట్టిగా నొక్కితే అందులో ఉన్న తడిని వస్త్రం పీల్చుకుంటుంది.

34
నీడలో ఎండబెట్టి

ఇప్పుడు తడిగా ఉన్న మెంతి ఆకులను ఎండబెట్టాలి. శుభ్రమైన పొడి క్లాత్ ను తీసుకొని దానిపై మెంతి ఆకులను పరచాలి. నేరుగా ఎర్రటి ఎండలో పెట్టకూడదు. గాలి, వెలుతురు వచ్చేలా కాస్త వేడి తగిలేలా నీడలో ఆరబెడితే సరిపోతుంది. ఇవి త్వరగానే ఎండిపోతాయి. రెండు మూడు రోజుల్లో ఈ మెంతి ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. తర్వాత మీరు చేతులతో నలిపితే అవి పొడి అయ్యేలా ఉంటాయి. అంటే కసూరి మేతి రెడీ అయినట్టే.

44
ఇలా నిల్వ చేయండి

చేతులతోనే ఎండిన ఆకులను నలుపుకోవాలి. ఒక గాలి చొరబడని డబ్బాలో వాటిని వేసి నిల్వ చేసుకోవాలి. కూర, పప్పు, పనీర్ వంటకాలు వండేటప్పుడు చివరిలో కసూరి మేతిని కూడా వేసుకుంటే కూరల నుంచి ఒక ప్రత్యేకమైన సువాసన వస్తుంది. ఇంట్లోనే దీన్ని శుచిగా తయారు చేశారు. కాబట్టి ఎలాంటి ఇతర ఆకులతో కల్తీ అయ్యే అవకాశం ఉండదు.

Read more Photos on
click me!

Recommended Stories