Water Bottle: వాటర్ బాటిల్ నుంచి దుర్వాసన పోవాలంటే ఈ చిన్నచిట్కాలతో శుభ్రం చేయండి

Published : Mar 12, 2026, 03:35 PM IST

Water Bottle: వాటర్ బాటిల్‌లో నిత్యం నీళ్లు ఉంటాయి. కాబట్టి అవి తరచూ ప్రేమతో నిండి ఉంటాయి. దీనివల్ల దుర్వాసన త్వరగా వస్తుంది. వాటర్ బాటిల్ వల్ల దుర్వాసన త్వరగా పోవాలంటే చిన్న చిట్కాలు పాటించండి. 

PREV
14
వాటర్ బాటిల్స్ క్లీనింగ్

ఆఫీసులకు, స్కూళ్లకు వాటర్ బాటిల్స్ ని తీసుకెళతారు. వాటిలో ఉండే నీరు బాటిల్.. అని ఎప్పుడూ తడిగానే ఉంచుతుంది. వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయడం చాలా అవసరం. నీటి వాటర్ బాటిల్స్ తాజాగా శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాము. అయితే తరచూ వాటర్ బాటిల్ దుర్వాసన వస్తూ ఉంటాయి. చేతితో తాకితే జిడ్డుగా అనిపిస్తాయి. అలాంటి వాటర్ బాటిల్స్ ను తరచూ శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్లాస్టిక్, స్టీలు వాటర్ బాటిల్స్ నుంచే ఎక్కువగా దుర్వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి అవి ఎలా శుభ్రం చేయాలో తెలుసుకోండి.

24
సబ్బు నురగ

వాటర్ బాటిల్స్‌లో ఉండే వాటర్ బాటిల్స్ లో ఏర్పడే బ్యాక్టీరియా ఎంతో హానికరమైనది. కాబట్టి ప్రతిరోజు వాటిని కడగాల్సిన అవసరం ఉంది. లేకపోతే దుర్వాసన వస్తుంది. బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోతుంది. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి గోరువెచ్చని నీరు తీసుకొని అందులో సబ్బును వేసి నురగ వచ్చేలా చేయండి. తర్వాత ఆ నీటిని బాటిల్ లో వేసి బ్రష్ తో లోపల భాగాన్ని బాగా రుద్దండి. తర్వాత బాటిల్ కింద పెట్టి ఆ నీటితో చాలాసార్లు శుభ్రం చేయండి. లేకపోతే సబ్బు తాలూకు వాసన ఉండిపోయే అవకాశం ఉంటుంది.

34
బేకంగ్ సోడా

బాటిల్ దుర్వాసనను పోగొట్టడంలో బేకింగ్ సోడా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం మీరు బాటిల్ లో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా గోరువెచ్చని నీరు కలపాలి. పైన మూత పెట్టి బాగా కదిలించాలి. కాసేపు అలా ఉంచేయాలి. తర్వాత శుభ్రమైన నీటితో కడిగితే ఆ దుర్వాసన చాలా వరకు పోతుంది.

44
నిమ్మనీటితో

నిమ్మకాయ క్లీనింగ్‌లో అద్భుతంగా పనిచేస్తుంది. ప్లాస్టిక్ బాటిల్‌ని శుభ్రం చేయడానికి నిమ్మకాయను ఉపయోగించడం మంచిది. కొద్దిగా నిమ్మరసం బాటిల్ లో వేసి నీరు కూడా వేయండి. మూత పెట్టి నీటిని బాగా షేక్ చేయండి. తర్వాత శుభ్రంగా బాటిల్ ను కడగండి. దీనివల్ల దుర్వాసన పోతుంది. అలాగే ఉప్పు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. బాటిల్ లో ఉప్పు వేసి కొంచెం నీరు వేసి బాటిల్‌కి మూత పెట్టి బాగా షేక్ చేయాలి. కాసేపు అలా వదిలేయాలి. తర్వాత మంచి నీటితో కడిగేస్తే దుర్వాసన పోయే అవకాశం ఎక్కువ

Read more Photos on
click me!

Recommended Stories