పొడి దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇలా తగ్గించుకోండి..

Published : Oct 22, 2022, 10:55 AM IST

మారుతున్న వాతావరణంలో పొడి దగ్గు ఎక్కువగా వస్తుంటుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే ఇంటి దగ్గరే దగ్గును వదిలించుకోవచ్చు. అవేంటంటే..   

PREV
17
పొడి దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇలా తగ్గించుకోండి..

చలికాలం మొదలైంది.  ఇక ఇప్పటినుంచి చలి జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వీటిలో పొడి దగ్గు ఒకటి. కోవిడ్ -19 తర్వాత చాలా మంది పొడి దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. ఈ పొడి దగ్గు వల్ల కఫం ఏర్పడదు. అలాగే గొంతులో నొప్పి కూడా పెడుతుంది. అందుకే ఈ సీజన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోగ నిరోధక శక్తిని పెంచే వాటినే తినాలి. అప్పుడే ఎలాంటి సమస్య నుంచైనా ఉపశమనం పొందుతారు. పొడి కఫం సమస్య నుంచి బయటపడేసే చిట్కాలు తెలుసుకుందాం పదండి..

27

పొడి దగ్గు ఒకరి నుంచి ఒకరి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే చుట్టూ ఉన్న వారికి కాస్త దూరంగా ఉండండి. అయితే వేడి వేడి పాలు తాగితే కూడా పొడిదగ్గు నుంచి ఉపశమనం పొందొచ్చు. వేడి పాలను నెమ్మదిగా తాగితే పొడి కఫం నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ పాలలో నల్లమిరియాల పొడిని కలుపుకుని తాగితే  దీని నుంచి తొందరగా బయటపడతారు. 
 

37

గోరు వెచ్చని నీళ్లు కూడా పొడి దగ్గును తగ్గిస్తాయ. ఇందుకోసం ముందుగా గ్లాస్ వాటర్ ను తీసుకుని గోరువెచ్చగా వేడి చేయండి. ఈ వాటర్ లో నల్ల ఉప్పును వేసి నోట్లో పోసి పుక్కిలించినా.. లేదా తాగినా ఈ సమస్య నుంచి తొందరగా బయపడతారు. 

47
Image: Getty Images

తేనె ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా తేనెను ఉపయోగించి పొడి దగ్గు నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇందుకోసం Mulethi powder ను తేనెను కలిపి తీసుకోండి. ఇది పొడి దగ్గును తగ్గించడమే కాదు కడుపునకు సంబంధించిన సమస్యలను కూడా నయం చేస్తుంది. 

57

తులసి ఆకులు కూడా పొడి కఫాన్ని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఎందుకంటే తులసిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ ఆకులను నీళ్లలో మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే పొడి దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. 

67

ఆసాఫోటిడా సహాయంతో కూడా పొడి దగ్గును వదిలించుకోవచ్చు. ఎందుకంటే ఈ సుగంధ ద్రవ్యంలో శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి.  ఇందుకోసం అల్లంను మెత్తగా గ్రైండ్ చేయండి. దీనిలో అసఫోటిడాను కలిపి తినండి. 

77

అల్లం టీ కూడా దగ్గును తగ్గిస్తుంది. అలాగే టీ స్పూన్ తేనెలో అర టీస్పూన్ శొంఠిని కలిపి తీసుకుంటే కూడా తగ్గిపోతుంది. తమలపాకును తింటే కూడా దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.    
   
 

Read more Photos on
click me!

Recommended Stories