బరువు తగ్గడానికి సరిగ్గా ఉపయోగపడే సూపర్ ఫుడ్స్ ఇవే.. తప్పక తినండి..

Published : Oct 22, 2022, 09:50 AM IST

మనం అనుకున్నంత తొందరగా బరువు తగ్గడమేనేది దాదాపుగా అసాధ్యమే. కానీ కొన్ని ఆహారాలను క్రమం తప్పకుండా తింటే మాత్రం రిజల్ట్ చాలా తొందరగా వస్తుంది.   

PREV
16
బరువు తగ్గడానికి సరిగ్గా ఉపయోగపడే సూపర్ ఫుడ్స్ ఇవే.. తప్పక తినండి..
weight loss

బరువు తగ్గడం అంత తేలికైన పనైతే కాదు. అలా అని ఇది పూర్తిగా అసాధ్యమైంది కూడా కాదు. నిజానికి బరువు తగ్గాలంటే మంచి ఆహారాలను తింటూ.. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఇవే మీ బరువును తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. బరువు తగ్గాలని ద్రాక్ష, ఆపిల్, అరటిపండ్లను తినే వారు ఉన్నారు. కొంతమంది ఆరోగ్య నిపుణుల ప్రకారం.. బరువును తగ్గించే ఆహారాల్లో కొన్నింటిని తింటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. అవేంటో తెలసుకుందాం పదండి. 

26

మఖానా

మఖానా మన ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే వీటిని చిరుతిండిగా తింటుంటారు. వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. మఖానా జీవక్రియను పెంచుతుంది. ఎందుకంటే ఇది కాలెయంపై నిర్విషీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది కాస్త శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. 
 

36
Turmeric

పసుపు

పసుపు టీని ప్రతిరోజూ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఇది కడుపులో ఉండే పిత్తం ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. పసుపు జీర్ణ రసాన్ని కూడా ఉత్పత్తి చూస్తుంది. ఇవి జీవక్రియకు కూడా సహాయపడుతుంది. మీ రోజు వారి ఆహారంలో పసుపును కొంతమొత్తంలో వేస్తే.. మీరు చాలా చాలా సులువుగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. 
 

 

46
guava

జామ

జామకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి ని ఎక్కువగా తీసుకునే వ్యక్తులను తీసుకోని వారితో పోల్చితే వ్యాయామంలో 30 శాతం ఎక్కువ కొవ్వును తగ్గిస్తారట. అందుకే బరువు తగ్గాలనుకునే వారు శరీరంలో విటమిన్ సి లోపించకుండా చూసుకోవాలి. విటమిన్ సి లోపం ఉన్న వారి శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జామ కాయలను తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. ఎందుకంటే ఇది కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. 
 

56

చిలగడదుంప

చిలగడదుంపలు బలే టేస్టీగా ఉంటాయి. అంతేకాదు వీటిలో ఎన్నో రకాల పోషకాలు కూడా ఉంటాయి. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, మాంగనీస్ వంటి ఎన్నో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. దీనిలో పుష్కలంగా ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రిస్తుంది. ఇది బరువును తగ్గించి.. కొవ్వు శాతాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. 
 

66

వాల్ నట్స్

బరువు తగ్గేందుకు సహాయపడే  సూపర్ ఫుడ్స్ లో వాల్ నట్స్ ఒకటి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆకలిని చాలా వరకు తగ్గిస్తాయి. వాల్ నట్స్ గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి గుండెపోటు ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. శరీరంలో ఉన్న అదనపు కొవ్వును కరిగించడానికి.. ఆరోగ్యకరమైన బరువును ప్రోత్సహించడానికి ఎంతగానో సహాయపడతాయి. 

 

Read more Photos on
click me!

Recommended Stories