సోయా సాస్ అంటే ఇష్టమా.. దీనివల్ల ప్రయోజనాలే కాదు.. నష్టాలు కూడా ఉన్నాయి.. అవేంటంటే..

First Published Oct 21, 2022, 4:58 PM IST

సాధారణంగా ప్రతి చైనీస్ ఫుడ్ లో సోయా సాస్ పక్కాగా ఉంటుంది. ఈ సోయా సాస్ వేసిన ఆహారాలు డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. ఈ సోయా సాస్ వల్ల ప్రయోజనాలతో పాటుగా నష్టాలు కూడా ఉన్నాయి. 
 

చైనీస్ ఫుడ్స్ లో సోయా సాస్ ను పక్కాగా ఉపయోగిస్తుంటారు. దీనివల్ల ఫుడ్ కు డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అజినోమోటో మాదిరిగానే.. సోయా సాస్ కూడా ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మంది నమ్ముతుంటారు. కానీ దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.. 
 

సోయా సాస్ ప్రయోజనాలు

సోయా సాస్ ను లిమిట్ లో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. దీనిలో ప్రోబయోటిక్ లక్షణాలు ఉంటాయి. ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది మాత్రమే కాదు సోయా సాస్ లో పాలీఫెనాల్స్ కూడా ఉంటాయి. ఇవి ఆహారాన్ని సులువుగా జీర్ణం అయ్యేందుకు సహాయపడతాయి. 
 

సోయా సాస్ లో యాంటీ అలెర్జీ లక్షణాలు కూడా ఉంటాయి. దీని వల్ల కొన్ని ఆహారాలను తినడం వల్ల కలిగే అలెర్జీ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. సోయా సాస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి మీ శరీరాన్ని రక్షిస్తాయి.

మీకు తెలుసా.. సోయా సాస్ లో కణితులను తగ్గించే యాంటీ-ట్యూమరిజెనిక్, యాంటీ-మ్యూటాజెనిక్ లక్షణాలు కూడా ఉంటాయి. అలా అని మోతాదుకు మించి దీన్ని తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అందుకే దీన్ని లిమిట్ లోనే తినాలి. 
 

సోయా సాస్ తినడం వల్ల కలిగే ప్రమాదాలు 

సోయా సాస్ ను మోతాదుకు మించి తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే దీనిలో ఎక్కువ మొత్తంలో సోడియం ఉంటుంది. ఇది రక్తపోటును అమాంతం పెంచుతుంది. రక్తపోటు ఎక్కువగా ఉండేవారు దీన్ని ఎక్కువ తినకూడదు.
 

సోయా సాస్ లో గోధుమలు, గ్లూటెన్ ఉంటాయి. ఒకవేళ మీకు గోధుమల వల్ల అలెర్జీ , ఉదరకుహర వ్యాధి ఉంటే దీన్ని అస్సలు తినకండి. ఎందుకంటే మీ సమస్యలను పెంచుతాయి. మార్కెట్ లో దొరికే సోయా సాస్ లల్లో ఎక్కువ మొత్తంలో ఫైటేట్ ఉంటుంది. ఇది శరీరంలో ఖనిజాల శోషణను నిరోధిస్తుంది.
 

సోయా సాస్ మరింత టేస్టీగా అవడానికి దీనిలో MSG ని కూడా కలుపుతారు. దీన్ని ఎక్కువగా తీసుకుంటే జీవక్రియ రుగ్మతలు, పునరుత్పత్తి అవయవాలపై హానికరమైన ప్రభావాలు పడతాయి. అలాగే వికారం, తలనొప్పి, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుంది. సోయా సాస్ లో హిస్టామిన్ ఉంటుంది. దీనివల్ల కొన్ని కొన్ని సార్లు చర్మంపై దద్దుర్లు, కడుపు సమస్యలు, చెమట, తలనొప్పి, మైకము వంటి సమస్యలు కలుగుతాయి.  
 

సోయా సాస్ ను తీసుకోవాల్సి వస్తే.. టీ స్పూన్ కంటే ఎక్కువ అస్సలు తీసుకోకండి. సోయా సాస్ వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకూడదంటే దీన్ని ఇంట్లోనే తయారుచేసుకోవడం మంచిది. కానీ పరిమితిలోనే తీసుకోవాలి. ప్రతిరోజూ తినడం సేఫ్ కాదు. 
 

click me!