జీవన శైలి వల్ల వచ్చే సర్వ సాధారణ వ్యాధే డయాబెటీస్. ఇది ప్రధానంగా శరీరంలో ఇన్సులిన్, రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల క్లోమం తగినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయలేకపోతుంది. డయాబెటీస్ ప్రాణాంతక వ్యాధి అయినప్పటికీ.. దీనిని కొన్ని జీవనశైలి పద్దతుల ద్వారా నియంత్రణలో ఉంచుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి వంటగదిలో ఉండే కొన్ని మూలికలు ఎంతో సహాయపడతాయి. ఈ మూలికలు క్లోమంను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రించడానికి వంటగదిలో ఉండే మూలికలేంటో తెలుసుకుందాం..