తొలిరాత్రి విషయంలో చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి. అసలు తొలిరాత్రి అనగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. కలయిక నొప్పిగా ఉంటుందేమోనని అమ్మాయిలు.. తమ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అని అబ్బాయిలు భయపడుతుంటారు. అంతేకాదు... ఇంకా చాలా అపోహలు కూడా ఉంటాయి. మరి వాటి గురించి నిపుణులు ఏం చెబుతున్నారో మనమూ ఓసారి చూసేద్దామా...
చాలా మంది ఒకే ఒక సెక్స్ పార్ట్ నర్ ని కలిగి ఉండటం వల్ల.. తమకు శృంగారపరంగా వ్యాపించే వ్యాధులు రాకుండా ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. తొలి కలయిక సమయంలోనూ... లైంగికంగా సక్రమించే వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. దానికోసం... తొలి కలయిక లోనూ కండోమ్ వాడాలి. రక్షణ ఉపయోగించడం ఎప్పటికైనా మంచి చేస్తుందని గుర్తించాలి.
మొదటిరాత్రి... స్త్రీలకు రక్త స్రావం జరుగుతుందని... పురుషులైతే ముఖ్యంగా ముందరి చర్మం కారణంగా గాయపడుతారని అనుకుంటూ ఉంటారు. అయితే అందులో పూర్తిగా నిజం ఉండదు. దాదాపు 65శాతం మంది స్త్రీలకు తొలి కలయిక సమయంలో రక్తస్రావం జరగదు, పురుషులకూ ఎలాంటి గాయాలు కావు.
కలయికలో పాల్గొన్న సమయంలో.... శబ్దాలు కచ్చితంగా చేయాలి అని రూల్ ఏమీ లేదు. సహజంగా అనిపిస్తేనే శబ్ధాలు చేయాలి. సినిమాలు చూపించినట్లుగా మాత్రమే శబ్ధాలు చేయాలని రూల్ లేదు. అది నకిలీగా ఉంటుంది. మీకు ఎలాంటి భావన కలిగితే... అలా చేయడం మంచిది.
జంటలు తమ వివాహానికి ముందు ఎప్పుడూ చాలా ఒత్తిడికి లోనవుతారు, ఎందుకంటే వారు నగ్నంగా ఉన్నప్పుడు ఉత్తమంగా కనిపించాలని కోరుకుంటారు, వారి మొదటి రాత్రికి సిద్ధమవుతారు. నిజం చెప్పాలంటే, శుభ్రంగా , సౌకర్యవంతంగా ఉండటం చాలా ముఖ్యం. ఒకరినొకరు చూసుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమం ఎందుకంటే మీరు ప్రతి రాత్రి సెక్స్ కోసం మీ నిజ స్వభావాన్ని ప్రమాణంగా సెట్ చేసుకుంటున్నారు.
కలయికలో పాల్గొన్న సమయంలో... తొలిరాత్రే సక్సెస్ అవుతారనే గ్యారెంటీ లేదు. తొలిసారి సక్సెస్ అవ్వాలి అని, లేకపోతే... తాము వేస్ట్ అని ఫీల్ అవ్వకూడదు. మొదటిసారి అందరూ సెక్సెస్ అయ్యే అవకాశం చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యమౌతుందనే విషయాన్ని గుర్తించాలి. తొలిరాత్రి సక్సెస్ కాకపోతే... తాము సమర్థులం కాదు అని బాధపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
సినిమాల నుండి అంచనాలను పెంచుకోవడం చాలా హాస్యాస్పదమైనది ఎందుకంటే ఇది వాస్తవికతకు చాలా దూరంగా ఉంది. సినిమాల్లో చూపించినట్లుగా ఉండదు. మీకు నచ్చినట్లుగా కలయికను ఆస్వాదించడానికి ప్రయత్నించాలి.