బెర్రీలను తినాలి
బెర్రీల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లను తీసుకోవడం వల్ల వీర్యకరణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు స్పెర్మ్ నాణ్యతను మెరుగుపర్చడానికి కూడా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ యాంటీ యాక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపుతాయి. ఇవి మన శరీరానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. పుచ్చకాయ, టమాటాలు, చిలగడదుంపలు, గుమ్మడిగింజలు, క్యారెట్లు, చేపలు, వాల్ నట్స్, బ్లూ బెర్రీలు, దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు స్పెర్మ్ కౌంట్ ను పెంచడంలో సహాయపడతాయి.