ఎప్పుడు చూసినా మూడ్ ఆఫ్ లోనే ఉంటున్నారా..? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..

First Published Aug 4, 2022, 12:00 PM IST

డోపామైన్ హార్మోన్ ఉంటేనే మనస్సు సంతోషంగా.. బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తుంది. ఒక వేళ ఈ డోపామైన్ లోపిస్తే ఫంక్షనల్ డిజార్డర్, ఏకాగ్రత లోపించడం, ఏ పనిచేయాలనిపించకపోవడం, డిప్రెషన్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు వస్తాయి.

కొన్ని కొన్ని సార్లు కారణం లేకుండానే మూడ్ ఆఫ్ లోకి వెళ్లిపోతుంటాం. దీనివల్ల మనుసు కుదురుగా ఉండదు. ఇది మనస్సును కుంగదీస్తుంది. ఇలాంటి సమయంలోనే గట్టిగా ఏడవాలనిపిస్తుంది. అయితే మనస్సు మూడ్ ఆఫ్ కావడానికి పెద్ద పెద్ద కారణాలేమీ ఉండవు. శరీరంలో డోపామైన్ అనే హార్మోన్ లోపించడం వల్లే ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

డోపామైన్ అనేది శరీరంలోని అడ్రినల్ గ్రంధిలో ఉత్పత్తి అయ్యే హార్మోన్. ఇది Neurotransmitter. శరీరం, మెదడు పనితీరులో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కదలికలు, మానసిక స్థితి, జ్ఞాపకశక్తి,  ఏకాగ్రత మొదలైనవి డోపామైన్ ప్రాథమిక విధుల్లో కొన్ని. శరీరంలో డోపామైన్ స్థాయిలు తగినంతగా ఉండకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి.

కొన్ని కొన్ని సార్లు మనకు తెలియకుండానే మనసంతా సంతోషంతో నిండిపోతుంది. దీనికి కారణం శరీరంలో డోపామైన్ ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవడం. దీని స్థాయిలు తగ్గితే నిరాశ, మానసిక పరిస్థితి బాగాలేకపోవడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. 

డోపామైన్ స్థాయిలు సాధారణంగా నాడీ వ్యవస్థలో  నియంత్రించబడినప్పటికీ.. దాని స్థాయిలను పెంచడానికి మీకు కొన్ని రకాల ఆహారాలు ఎంతో సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

డార్క్ చాక్లెట్

చాక్లెట్ లో కొద్ది మొత్తంలో ఉండే Phenylethylamine డోపామైన్ రిలీజ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. డార్క్ చాక్లెట్ తిన్న తర్వాత డోపామైన్ విడుదలవుతుంది. దీనితో పాటు మూడ్ కూడా బాగుంటుంది.

 గింజలు, విత్తనాలు

ప్రోటీన్ పుష్కలంగా ఉండే గింజలు, విత్తనాల్లో  టైరోసిన్ ఉంటుంది. ఇది విచ్చిన్నం అయ్యి డైపామైన్ గా మారుతుంది. అందుకే వీటిని మీ రోజు వారి బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకుంటే హ్యాపీ మూడ్ లోకి మారిపోతారు. 
 

గుమ్మడి గింజలు, నువ్వులు, వేరుశెనగ, బాదం పప్పుల్లో టైరోసిన్ పుష్కలంగా ఉంటుంది. మూడ్ ఆఫ్ నుంచి బయటకు రావాలంటే.. వీటిని తినండి. మనస్సే తేలిక పడుతుంది. హ్యాపీ హార్మోన్లు కూడా రిలీజ్ అవుతాయి. ఈ గింజలను తినడం వల్ల శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 
 

పాల ఉత్పత్తులు

పాలు, పెరుగు, జున్ను వంట పాల ఉత్పత్తులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా జున్నులో టైరామిన్ ఉంటుంది. ఇది మన శరీరంలోకి వెళ్లిడోపామైన్ గా మారుతుంది. పెరుగు వంటి ప్రోబయోటిక్స్ కలిగి ఉన్న ఆహారాలను తినడం వల్ల డోపామైన్ స్థాయిలు పెరుగుతాయి. ఒకవేళ మీరు ఒత్తిడికి గురైనట్లయితే.. వెంటనే  డైరీ ప్రొడక్ట్స్ ను తినండి. ఇవి మీ మూడ్ ను సెట్ చేస్తాయి. 
 

espressos

కాఫీ 

నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. కాఫీలోని కెఫిన్ డోపామైన్ ను పెంచుతుంది. అందుకే మూడ్ ఆఫ్ అయ్యింది అనిపించడానే ఒక కప్పు వేడి వేడి కాఫీని తాగండి. 
 

ఆకుకూరలు

ఆకుపచ్చ కూరగాయలను శాస్త్రీయంగా క్రూసిఫరస్ వెజిటబుల్ గ్రూప్ అని పిలుస్తారు. ఇందులో బచ్చలికూర, పాలకూర, కాలీఫ్లవర్, క్యాబేజీ,  బ్రోకలీ వంటి ఎన్నో కూరగాయలున్నాయి. ఇవి శాకాహారులకు ప్రధాన డోపామైన్ బూస్టర్ గా పనిచేస్తాయి.

click me!