Dark Circles: డార్క్ సర్కిల్స్ తో ఇబ్బంది పడుతున్నారా? ఇదిగో వాటిని ఇలా పోగొట్టండి..

First Published Jul 1, 2022, 10:50 AM IST

Dark Circles: డార్క్ సర్కిల్స్ రావడానికి ఎన్నో కారణాలున్నాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో కళ్లకింద నల్లటి వలయాలను పోగొట్టొచ్చు. 
 

కంటి నిండా నిద్రలేకపోవడం, మారుతున్న జీవన శైలి, వయసు ప్రభావం, శరీరంలో తగినంత నీరు లేకపోవడం, స్మోకింగ్, ఆల్కహాల్  వంటి వివిధ కారణాల వల్ల కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ ఏర్పడుతాయి. ఈ సమస్య నుంచి అంత సులువుగా బయటపడటం కష్టమే అంటుంటారు నిపుణులు.
 

డార్క్ సర్కిల్స్ వల్ల నలుగురిలోకి వెళ్లడానికి కూడా వెనకాడుతుంటారు చాలా మంది. ఇలాంటి వారిలో ఆత్మవిశ్వాసం కూడా తక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను ఫాలో అయితే ఈ సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

నిద్ర (Sleep)

నిద్రలేమి ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. అందులో ఒకటి డార్క్ సర్కిల్స్. కంటి నిండా నిద్రపోకపోవడంతోనే చాలా మందికి కంటి చుట్టూ నల్లటి వలయాలు వస్తుంటాయి. అందుకే ఈ సమస్య ఉన్న వాళ్లు ప్రతి రోజూ 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. అప్పుడే ఈ సమస్య నుంచి బయటపడతారు.
 

నీళ్లు (water)

నీళ్లే సర్వ రోగ నివారిణీ అంటారు ఆరోగ్య నిపుణులు. శరీరానికి సరిపడా నీళ్లు లేకపోతేనే ఎన్నో సమస్యలు వస్తాయి. కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడటానికి నీళ్లు కూడా ఒక కారణమే అంటున్నారు నిపుణులు. మన శరీరంలో తగినన్ని నీళ్లు లేకపోవడం వల్ల బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీనివల్ల కంటి చుట్టు బ్లాక్  సర్కిల్స్ ఏర్పడుతాయి. అందుకే రోజు 10 గ్లాసుల నీటిని తాగండి. అప్పుడే బ్లాక్ సర్కిల్స్ తగ్గడంతో పాటుగా మీరు కూడా  ఆరోగ్యంగా ఉంటారు. 

ఉప్పు (Salt)

ఉప్పు మన శరీరానికి చాలా అవసరం. అలా అని మోతాదుకు మించి తింటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఏరి  కోరి కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. ఉప్పు వాడకం పెరిగితే 'డార్క్ సర్కిల్స్' ఏర్పడతాయి. అందుకే ఉప్పును మోతాదులోనే వాడండి. ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తే మీ శరీరం డీహైడ్రేట్ బారిన పడుతుంది. 

alcohol

మద్యపానం (Alcohol)

రెగ్యులర్ గా ఆల్కహాల్ ను తాగడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడుతాయి. అందుకే ఈ ఆల్కహాల్ ను విచ్చల విడిగా తాగడం మానేయండి. ఆల్కహాల్ చర్మంపై ప్రతికూల ప్రభావాన్ని చూపెడుతుంది. ఆల్కహాల్ ను మోతాదుకు మించి తాగితే మీరు తొందరగా ముసలివాళ్లలా కనిపిస్తారు. చర్మంపై ముడతలు వస్తాయి. స్కిన్ పొడిబారిపోతుంది.

smoking

దూమపానం (Smoking)

మద్యపానం మాదిరిగానే  ధూమపానం (Smoking) కూడా 'డార్క్ సర్కిల్స్'కు కారణమవుతుంది. అందుకే దీన్ని తాగడం మానేయండి. 

శారీరక శ్రమ (physical activity)

శారీరక శ్రమ లేకపోవడం వల్ల చర్మంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందులో డార్క్  సర్కిల్స్ కూడా ఒకటి. అందుకే ఇప్పటినుంచైనా రెగ్యులర్ గా వ్యాయామం చేయండి. ఇది చర్మానికి పోషణను అందిస్తుంది. 
 

click me!