పాలిచ్చే తల్లులు తప్పక తినాల్సిన ఆహారాలు ఇవే..

First Published Jun 30, 2022, 4:59 PM IST

పిల్లలు పుట్టాకా తల్లులు శరీరకంగా బలహీనంగా మారుతారు. అందుకే వీరు పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను ఖచ్చితంగా తినాలి. 
 

గర్బిణులుగా ఉన్నసమయంలో పోషకాహారం ఎంత అవసరమో.. బిడ్డ పుట్టిన తర్వాత కూడా అంతే అవసరం. ఎందుకంటే వీరిచ్చే పాలపైనే బిడ్డ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. బిడ్డ ఎదుగుదలకు అవసరమైన పోషకాలు తల్లిపాల ద్వారానే  అందుతాయి. కానీ చాలా మంది తల్లులు బిడ్డ పుట్టిన తర్వాత పూర్తిగా తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటారు. దీనికి తోడు బిడ్డ పాలు తాగడంతో తల్లులు ఇంకాస్త వీక్ గా మారుతారు. అందుకే వీరికి మంచి పోషకాహారం అవసరం. అప్పుడే తల్లుల ఆరోగ్యం బాగుండటంతో పాటుగా బిడ్డకు పాలు కూడా ఎక్కువగా అందుతాయి. 

మంచి పోషకాహారమే బిడ్డ బలంగా ఎదగడానికి, స్మార్ట్ గాతయారవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి, ఎదగడానికి సహాయపడతుంది. ఇందుకోసం పాలిచ్చే తల్లులు తమ రోజువారి ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

బొప్పాయి (papaya)

బొప్పాయిలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు పాలిచ్చే తల్లులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పండు మీ రొమ్ముల్లో పాల స్థాయిని, నాణ్యతను పెంచుతుంది. ఈ పండును రెగ్యులర్ గా తినడం వల్ల  జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఇది సెల్యులైట్ పెరగకుండా అడ్డుపడుతుంది. 
 

Dalia

Dalia ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. విరిగిన గోధుమలతో తయారు చేసిన డాలియా మీ ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. ఇది చాలా సులువుగా జీర్ణమవుతుంది. దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. తక్షణ శక్తిని అందించడంలో ఇది ముందుంటుంది. 
 

Amarnath Leaves

Amaranth

Amaranth సీడ్స్ కొత్తగా తల్లులైన వారికి ఎంతో మంచిది. దీనిలో పోషకాలు, న్యూట్రీషన్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. డెలివరీ తర్వాత జుట్టు రాలే సమస్యను ఇవి పోగొడతాయి. దీనిలో ఇనుము, రాగి మాంగనీస్, ఫాస్పరస్,  సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తల్లులను బలంగా తయారుచేస్తాయి. 

అరటి (banana)

అరటిపండు తల్లుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో విటమిన్ బి, ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు పెక్టిన్ కూడా అధికంగా ఉంటుంది. ఈ ఎనర్జిట్ ఫ్రూట్ ను తినడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. అలాగే రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతాయి. గట్ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. ఇది పెద్ద ప్రేగులోని మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. అరటిలో ఉండే మెగ్నీషియం  postpartum depression పోరాడటానికి కూడా సహాయపడుతుంది. మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. 

నానబెట్టిన గింజలు (Soaked nuts)

నానబెట్టిన గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ బి, విటమిన్ కె, కాల్షియం, ఇనుము, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలు అధికంగా ఉంటాయి. అంతేకాదు మన శరీరానికి అవసరమయ్యే కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. నానబెట్టిన గింజలను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నీ లభిస్తాయి. 

పాలు (Milk)

తల్లి కి గానీ బిడ్డకు గానీ అలెర్జీ సమస్య లేనట్లయితే..  స్తన్యం పాలిచ్చే తల్లులు పాలను తప్పక తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలలో విటమిన్ బి 12, 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే మీ రోజువారీ అవసరాలలో 50% పోషకాలను కలిగి ఉంటుంది. ఒక రోజుకు మీ శరీరాకినికి కావాల్సిన కాల్షియం 25%, 15% పొటాషియం, విటమిన్ డి ని కలిగి ఉంటుంది.
 

click me!