Weight loss: రోజూ వీటిని తింటే ఎంత ఫాస్ట్ గా బరువు తగ్గుతారో..!

First Published Jul 1, 2022, 9:54 AM IST

Weight loss: బరువు తగ్గడానికి ప్రోటీన్ ఫుడ్ ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా మీ రోజు వారి ఆహారంలో ఈ నాలుగు ఆహారాలను చేర్చుకోవడమే. 
 

బరువు తగ్గేప్రాసెస్ అంత సులువైంది కాదు.  ఒకరోజు రెండు రోజులు ప్రయత్నిస్తే తగ్గరు. బరువు తగ్గేంతవరకూ ప్రతిరోజూ మరువకుండా మన ప్రయత్నాలను ఆపకూడదంటారు ఆరోగ్య నిపుణులు. ఇక కొంతమంది  బరువు తగ్గేందుకు గంటల తరబడి వ్యాయామాలు చేస్తుంటారు. ఈ వ్యాయామాలు చేసే వారు ప్రోటీన్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అందుకే వ్యాయామాలు చేసే వారు ప్రోటీన్ షేక్ ను తాగుతుంటారు. సరైన మొత్తంలో వీటిని తాగడం ఆరోగ్యానికి మంచిదే కానీ.. మరీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రోటీన్ షేక్ కు బదులుగా ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాలు చాలానే ఉన్నాయి. వాటిని తీసుకున్నా మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.

ప్రోటీన్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీంతో మీరు తరచుగా తినే అవకాశం ఉండదు. ఆకలి కూడా తొందరగా కాదు. ముఖ్యంగా చిరుతిళ్లకు దూరంగా ఉంటారని పలు పరిశోధనలు ఇప్పటికే తేల్చి చెప్పాయి. అధిక ప్రోటీన్ తీసుకోవడం వ్యాయామం సమయంలో మీరు ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తారు. 

అధిక బరువు, ఊబకాయం గల 65 మంది ఆడవారిపై ఆరు నెలల ఆహార అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనం ప్రకారం.. అధిక ప్రోటీన్ ఆహారం అధిక కార్బ్ కంటే సగటున 43% ఎక్కువ కొవ్వును కోల్పోయిందని కనుగొన్నారు. అధిక ప్రోటీన్ తీసుకున్న 35% మంది మహిళలు కనీసం 10 కిలోల బరువును కోల్పోయారని అధ్యయనాలు వెల్లడించాయి. వ్యాయామం చేసినా.. మీరు బలహీనంగా లేకుండా అలసటకు గురిచేయకుండా చేసే కొన్ని ఆహారాలు ఇక్కడ ఉన్నాయి. .

సాల్మన్ (Salmon)

సాల్మన్ చేపలలో  ప్రోటీన్లు, ఒమేగా -3 కొవ్వులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 100 గ్రాముల Farmed salmon చేపల్లో 206 కేలరీలు మాత్రమే ఉంటాయి. అడవి సాల్మన్ లో 182 కేలరీలు మాత్రమే ఉంటాయి. క్రమం తప్పకుండా  బ్రౌన్ రైస్ తో సాల్మాన్ చేపలను తినడం వల్ల మీరు చాలా సులువుగా బరువు తగ్గుతారు. ఎందుకంటే ఇది మీ ఆకలిని అణచివేస్తుంది. ఎక్కువ సేపు మీ కడుపును నిండుగా ఉంచుతుంది. అలాగే ఇది మీ జీవక్రియను పెంచి.. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. 

గుడ్లు (Eggs)

గుడ్డు సంపూర్ణ ఆహారం. దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మొత్తం గుడ్డును తిన్నా బరువేమీ పెరగరు. కావాలంటే మీరుు గుడ్డులో పచ్చసొనను తీసేసి తెల్ల సొనను మాత్రమే తినొచ్చు. గుడ్లు తినడం వల్ల మీరు చాలా సులువుగా బరువు తగ్గుతారు. గుడ్డును మీ రోజు వారి ఆహారంలో ఖచ్చితంగా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యేకించి మీరు కఠిణమైన వ్యాయామాలు చేసే వారైతే గుడ్లను ఖచ్చితంగా తినాలి. ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. గుడ్డలో ఇనుము, విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంటాయి. 

గ్రీకు పెరుగు (Greek yogurt)

పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ జీవక్రియను పెంచడంతో పాటుగా అధిక బరువును తగ్గించడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. పెరుగులో ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది. ఇతర పెరుగులతో పోల్చితే గ్రీకు పెరుగులో ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఒక కప్పు గ్రీకు పెరుగులో సుమారుగా 17 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ప్రతిరోజూ సాయంత్రం వేళ ఒక కప్పు గ్రీకు పెరుగును లేదా దానిలో దాల్చిన చెక్క పౌడర్, బెర్రీలను వేసుకుని తీసుకున్నా బరువు తగ్గుతారు. 
 

Edamame

ఎడామామే (Edamame)
 
ఎడమామే కూడా మంచి ప్రోటీన్ ఫుడ్. దీనిలో ప్రోటీన్లు, ఫైబర్, ఫైటోఈస్ట్రోజెన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే ఫైటోఈస్ట్రోజెన్లు మహిళల నెలసరి సమయంలో వచ్చే నొప్పిని ఇతర సమస్యలను కూడా తగ్గిస్తాయి. ఒక కప్పు ఎడామేమ్ లో 8 గ్రాముల ఫైబర్, 17 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీన్ని మీ రోజు వారి ఆహారంలో చేర్చడం వల్ల మీరు చాలా ఫాస్ట్ గా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ఒక కప్పులో కేవలం 180 కేలరీలు మాత్రమే ఉంటాయి. అలాగే దీనిలో ఉండే అధిక ఫైబర్, ప్రోటీన్ మీకు తొందరగా ఆకలి కాకుండా చేస్తాయి. 

click me!