Happy Life: కోటీశ్వరులు కాకపోయినా,ఇవి చేస్తే సంతోషంగా ఉండొచ్చు..!
జీవితంలో తమకు లభించిన వాటిపట్ల కృతజ్ఞతగా ఉండటం నేర్చుకోవాలి. లేని వాటి గురించి బాధపడకుండా, ఉన్నవాటితో ఎంత ఆనందంగా ఉండాలో తెలుసుకోవాలి.
జీవితంలో తమకు లభించిన వాటిపట్ల కృతజ్ఞతగా ఉండటం నేర్చుకోవాలి. లేని వాటి గురించి బాధపడకుండా, ఉన్నవాటితో ఎంత ఆనందంగా ఉండాలో తెలుసుకోవాలి.
జీవితంలో సంతోషాన్ని కోరుకోనివారు ఎవరూ ఉండరు. అయితే.. కేవలం డబ్బులు ఉన్నవారు మాత్రమే సంతోషంగా ఉండగలం అని అనుకుంటూ ఉంటారు. కానీ.. డబ్బు లేకపోయినా కొన్ని పనులు చేయడం వల్ల కూడా సంతోషంగా ఉండొచ్చు. మరి, ఆ పనులేంటో చూద్దామా..
కృతజ్ఞతగా ఉండటం..
చాలా మంది తమ దగ్గర డబ్బు లేదని, ఖరీదైన భవనాలు లేవని.. ఇలా లేని దాని కోసం నిత్యం బాధపడుతూనే ఉంటారు. ఇలాంటివారు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. అలా కాకుండా.. ఉన్నదానికి తృప్తి చెందడం అలవాటు చేసుకోవాలి. జీవితంలో తమకు లభించిన వాటిపట్ల కృతజ్ఞతగా ఉండటం నేర్చుకోవాలి. లేని వాటి గురించి బాధపడకుండా, ఉన్నవాటితో ఎంత ఆనందంగా ఉండాలో తెలుసుకోవాలి. అలా ఆనందాన్ని కలిగించే మూడు విషయాలను ఓ పేపర్ మీద రాయాలి. ఇలా రాయడం వల్ల మీ జీవితంలో లేని వాటి నుండి సమృద్ధిగా ఉన్న వాటిపై మీ దృష్టిని మారుస్తుంది - తద్వారా మీరు సానుకూలంగా,సంతోషంగా ఉంటారు.
బంధాలు..
ఎవరితో సంబంధం లేకుండా.. ఒంటరిగా జీవించేవారు ఎప్పుడూ అసంతృప్తితోనే ఉంటారు. అలా కాకుండా..మనకంటూ నలుగురు వ్యక్తులు ఉండేలా చూసుకోవాలి. మంచి స్నేహితులు, బంధువులు చుట్టూ ఉంటే సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు.కాబట్టి, మీ స్నేహితులు ,కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపండి. మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి
వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదల అవుతాయని అనేక అధ్యయనాల్లో రుజువైంది.వ్యాయామం కారణంగా మన మెదడుకు సహజంగా, మంచి అనుభూతి కలిగించే హార్మోన్లు విడుదల అవుతాయి. దాని కోసం ప్రతిరోజూ ప్రతిరోజూ 20 నిమిషాల నడక లేదా తేలికపాటి వ్యాయామం కూడా మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఫలితంగా సంతోషంగా ఉండగలం.
తగినంత నిద్రపోండి
నిద్ర లేకపోవడం ఒకరి భావోద్వేగ నియంత్రణను ప్రభావితం చేస్తుంది.వారు మరింత ఒత్తిడికి గురవుతారు. కాబట్టి, మీ నిద్ర అలవాట్లను సరిచేసుకోండి.అది మీ మొత్తం శ్రేయస్సును ఎలా సానుకూలంగా మెరుగుపరుస్తుందో చూడండి. ధ్యానం ఒత్తిడి ,ఆందోళనను తగ్గిస్తుంది.ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. అంతేకాదు, రోజులో కాసేపు అయినా ప్రకృతిలో సమయం గడపడం అలవాటు చేసుకోవాలి.ప్రకృతి సహజ వైద్యం లాంటిది. ఆ ప్రకృతిలో సమయం గడపడం వల్ల ఒత్తిడి తగ్గిస్తుంది. దీని వల్ల కూడా ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలరు.
జీవితంలో అర్థవంతమైన లక్ష్యాలను కలిగి ఉండండి
అర్థవంతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం ,వాటి ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల జీవితంలో లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల పెరగడంతో పాటు.. దానికి చేరువయ్యే సమయంలో ఆనందం కూడా పెరుగుతుంది. వీలైనంత వరకు సోషల్ మీడియా లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే..వాటిలో చూసి, ఇతరుల్లా తమ జీవితం లేదని పోల్చుకుంటూ ఉంటే సంతోషం కరువౌతుంది. అలా కాకుండా.. ఇతరులతో పోల్చుకోకుండా.. ఉన్నదాంట్లో తృప్తి పడితే మీ జీవితం సంతోషంగా సాగుతుంది. మనం లగ్జరీ కార్లు కొనుక్కోలేకపోవచ్చు. కానీ.. చిన్న చిన్న ఆనందాలను మాత్రం సంబరంగా జరుపుకుంటే.. కచ్చితంగా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది.