ఈ ఐదు పండ్లును తినండి చాలు.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు..

Published : Oct 15, 2022, 05:01 PM IST

శరీరంలో పోషకాలు లోపిస్తేనే ఎన్నో రోగాలు వస్తాయి. అందుకే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలని డాక్టర్లు సలహానిస్తుంటారు.       

PREV
16
ఈ ఐదు పండ్లును తినండి చాలు.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు..

ఆరోగ్యంగా ఉండేందుకు.. సరైన ఆహారపు అలవాట్లు చాలా అవసరం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..  మనం ఎప్పుడూ కూడా పోషకహారాన్నే తీసుకోవాలి. ఇవే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్, విటమిన్లు, పొటాషియం, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.. 

26
grapes

ఎండుద్రాక్ష

ఎండు ద్రాక్ష ప్రయోజనాలను పొందడానికి.. కొన్ని ఎండు ద్రాక్షలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకోండి. ఈ ఎండు ద్రాక్షల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఎన్నో పోషకాల లోపాలను భర్తీ చేస్తుంది. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం.. 100 గ్రాముల ఎండుద్రాక్షలో 3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. 
 

36

జామపండు

జామ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. యుఎస్డిఎ ప్రకారం.. 100 గ్రాముల జామకాయలో 2.6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి మీరు రోజూ జామపండును తినొచ్చు. ఇందులోని పీచుపదార్థం మలబద్ధకం సమస్యను పోగొడుతుంది. జామపండులో ఉండే పీచుపదార్థం కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. ఇది మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. 
 

46

ఖర్జూరాలు 

ఖర్జూరాల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిలో ప్రోటీన్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల ఖర్జూరాల్లో 2.45 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే 4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ 100 గ్రాముల ఖర్జూరాలను తినాలి. ఖర్జూరాలు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. 
 

 

56

అవోకాడో

అవొకాడో లో కూడా ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అవొకాడోలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 1 కప్పు అవోకాడోలో సుమారు 4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అనేక అనారోగ్య సమస్యలను తొలగిస్తుంది. అవొకాడోతో స్మూతీ తయారు చేసుకుని కూడా తినొచ్చు. లేదా అవోకాడో టోస్ట్ ను కూడా తినొచ్చు. దీనివల్ల శరీరంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి. 
 

66

కివి 

కివి పండ్లలో కూడా పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కప్పు కివిలో 2.1 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్  మీ రోజువారి అవసరాలను తీర్చుతుంది. కివి పండ్లు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. శరీరానికి పోషణను కూడా అందిస్తాయి. 

Read more Photos on
click me!

Recommended Stories