వేడి వేడి పాలలో దీన్ని కలుపుకుని తాగండి.. కీళ్ల నొప్పుల నుంచి ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి..

First Published Oct 15, 2022, 2:53 PM IST

పాలు సంపూర్ణ ఆహారం. వీటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు బలంగా చేస్తుంది. అంతేకాదు ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి. 
 

మన తాతలు, ముత్తాల కాలంలో రోగాలు కేవలం పెద్ద వయసు వారికే వచ్చేవి. కానీ ఇప్పుడు చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క వయసు వారికి ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులు వస్తున్నాయి. అందులోనూ కొన్ని రోగాలైతే సర్వ సాధారణం అయిపోయాయి. కారణం మారుతున్న జీవన శైలి, వాతావరణ కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్లు. అయితే ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ.. ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. 
 

హెల్తీ ఆహారాల్లో పాలు ఒకటి. పాలు సంపూర్ణ ఆహారం. వీటిలో మన శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలుంటాయి. రోజుకు రెండు గ్లాసుల పాలను తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా వేడి వేడి పాలలో నెయ్యిని కలిపి తాగితే వీటిలో పోషకాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పాలను తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం

ఈ రోజుల్లో కీళ్ల నొప్పులు చిన్న వయసు వారికి కూడా వస్తున్నాయి. ఇలాంటి వారికి పాలు ప్రయోజనకరంగా ఉంటాయి. వేడి వేడి పాలలో నెయ్యిని కలిపి తాగితే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. నిజానికి పాలలో నెయ్యిని కలపడం వల్ల మంట తగ్గుతుంది. పాలలో కాల్షియం ఉంటుంది. దీనివల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. 
 

రాత్రి పడుకునే ముందు గ్లాస్ పాలలో నెయ్యిని కలిపి తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఈ పాలు మీ బ్రెయిన్ నరాలను రిలాక్స్ చేస్తాయి. నరాల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇకపోతే నెయ్యి ఇత్తిడిని తగ్గించే మీరు రిలాక్స్డ్ గా నిద్రపోవడానికి సహాయపడుతుంది. 
 

పాలు, నెయ్యి కాంబినేషన్ మీ కడుపు ఆరోగ్యానికి మంచిది. ఈ పాలను తాగడం వల్ల జీర్ణక్రియ మరింత మెరుగ్గా పనిచేస్తుంది.  దీనివల్ల మలబద్దకం, అజీర్థి, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. 
 

చర్మానికి మేలు

మీ చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండాలనుకుంటే గ్లాస్ వేడి వేడి పాలలో ఒక టీ స్పూన్ నెయ్యిని కలిపి తాగండి. ఈ పాలు మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి. డ్రై స్కిన్, వృద్ధాప్యంలో వచ్చే ముడతలు, మచ్చలను తొలగించేందుకు ఈ పాలు ఎంతో సహాయపడతాయి. 

click me!