డయాబెటీస్ పేషెంట్లకు ఈ విత్తనాలు ఓ వరం..!

First Published Oct 15, 2022, 4:09 PM IST

ఈ రోజుల్లో డయాబెటీస్ సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. అయితే షుగర్ పేషెంట్లు ఏది పడితే అది తినకూడదు. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
 

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది డయాబెటీస్ బారినపడుతున్నారు. డయాబెటిస్ ఉన్న వారి శరీరంలో ఇన్సులిన్ లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ అవుతాయి. శరీరం ఇన్సులిన్ ఉపయోగించలేనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. మధుమేహులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తినే  ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఆరోగ్యానికి ఏది మంచిది? ఏది కాదు? అన్న విషయాలను తెలుసుకోవాలి. మధుమేహులకు చియా విత్తనాలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి పోషకాల భాండాగారం. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల రోగాలు నయమవుతాయి. ఈ గింజలు మధుమేహులకు ఏ విధంగా మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

మధుమేహ వ్యాధిగ్రస్తులకు చియా విత్తనాలు మంచివేనా?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చియా విత్తనాల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ టైప్ 2 డయాబెటిస్ సమస్య ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. సంతులిత ఆహారంతో పాటు చియా విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకోవడం బరువు సులువుగా తగ్గుతారు. బరువు కంట్రోల్ లో ఉంటే డయాబెటీస్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. అంతేకాక చియా విత్తనాల్లో శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇది మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
 

చియా విత్తనాలను ఎలా తీసుకోవాలి? 

ఒక ఔన్సు చియా విత్తనాల్లో 10 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుందని  నిపుణులు చెబుతున్నారు. వయసు, లింగం బట్టి ప్రతిరోజూ 22.4 నుంచి 33.6 గ్రాముల ఫైబర్ తినొచ్చు. ఎవరికైనా మధుమేహం ఉంటే రోజుకు రెండు టేబుల్ స్పూన్లు లేదా 20 గ్రాముల చియా విత్తనాలను తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 
 

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఒక టేబుల్ స్పూన్ చియా విత్తనాలను తీసుకుని బాటిల్ వాటర్ లో నానబెట్టాలి.  అందులో సన్నగా తరిగిన నిమ్మకాయ ముక్కలను కూడా కలపండి. ఈ పానీయాన్ని ఒక గంట తర్వాత  తీసుకోండి. మధుమేహులు ఈ చియా విత్తనాలను సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఈ సలాడ్ లో కావాలనుకుంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, అవిసె గింజలను కలిపి తీసుకోవచ్చు. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది.


అవిసె గింజలు దుష్ప్రభావాలు

అవిసె గింజల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ..  దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. వీటిని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. చియా విత్తనాల వల్ల కలిగే దుష్ప్రభావాలలో మధుమేహం, అధిక రక్తపోటు, అలెర్జీలు లేదా జీర్ణ సమస్యలు ఉన్నాయి. ఏదైనా సరే అధికంగా తీసుకున్నట్టైతే ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి. మోతాదులో తీసుకుంటేనే మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. 
 

click me!