Thyroid: మహిళల్లో థైరాయిడ్ సమస్య వస్తే మొదటి కనిపించే లక్షణం ఇదే, జాగ్రత్త

Published : Sep 17, 2025, 12:19 PM IST

థైరాయిడ్ (Thyroid) ఇప్పుడు ఎక్కువ మంది మహిళలకు వస్తున్న ఆరోగ్య సమస్య. ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు కానీ తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. మెడ ముందు భాగంలో ఉండే సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి థైరాయిడ్.  థైరాయిడ్ వస్తే కనిపించే లక్షణాలు ఇవిగో. 

PREV
15
మహిళల్లో థైరాయిడ్ సమస్య

ఎంతోమంది మహిళలకు థైరాయిడ్ సమస్య వస్తోంది.  కేవలం మహిళలే కాదు మగవారిలో కూడా థైరాయిడ్ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అయితే థైరాయిడ్ సమస్య రాగానే కనిపించే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో తెలుసుకోండి.

25
థైరాయిడ్ గ్రంథి

థైరాయిడ్ అనేది మెడ ముందు భాగంలో ఉండే సీతాకోకచిలుక ఆకారపు ఎండోక్రైన్ గ్రంథి. ఇది జీవక్రియ, హృదయ స్పందన రేటు, శరీర ఉష్ణోగ్రత, పెరుగుదల, ఇతర శారీరక విధులను నియంత్రించడానికి హార్మోన్లను (T3, T4) ఉత్పత్తి చేస్తుంది. వీటి ఉత్పత్తి సరిగ్గా జరిగితేనే జీవక్రియలు సవ్యంగా జరుగుతాయి.

35
థైరాయిడ్ ఎందుకు వస్తుంది?

థైరాయిడ్ గ్రంథి పనితీరులో మార్పు వచ్చినా లేదా దాని నిర్మాణంలో సమస్య వచ్చినా కూడా థైరాయిడ్ వ్యాధి వస్తుంది. ఇది అతిగా హార్మోన్లు ఉత్పత్తి అయినప్పుడు (హైపర్‌థైరాయిడిజం) లేదా తక్కువగా ఉత్పత్తి కానప్పుడు (హైపోథైరాయిడిజం) థైరాయిడ్‌ సమస్యకు దారితీస్తుంది. థైరాయిడ్ ఉంటే శరీరం చూపించే కొన్ని ప్రారంభ లక్షణాల గురించి ఇప్పుడు చూద్దాం.

45
తరచూ వికారం

మీకు తరచూ వికారం అనిపిస్తూ ఉంటేహైపర్‌థైరాయిడిజం, హైపోథైరాయిడిజం రెండింటి లక్షణాలు కావచ్చు. అనూహ్యంగా బరువు పెరగడం లేదా తగ్గడం థైరాయిడ్ మరో లక్షణం. డిప్రెషన్, ఆందోళన కూడా థైరాయిడ్ లక్షణాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

55
పీరియడ్స్ రాకపోతే

 మహిళలకు ప్రతి నెలా పీరియడ్స్ రావాలిత. అలా కాకుండా పీరియడ్స్ సరిగా రాకపోతే అది  థైరాయిడ్ లక్షణమేనని భావించాలి. మెడ చుట్టూ వాపు లేదా నలుపు కనిపించడం థైరాయిడ్ మరో లక్షణం. పొడి చర్మం, గోళ్లు త్వరగా విరిగిపోవడం కూడా థైరాయిడ్ లక్షణాలే.

Read more Photos on
click me!

Recommended Stories