Cooking Oil: ప్రతి ఇంట్లో వంట నూనె ఉంటుంది. షాపు నుంచి వంట నూనె తెచ్చి ఎన్ని రోజుల్లో దాన్ని వాడాలి? నూనె ఎక్స్ పైరీ డేట్ ఉంటుందా? అనే విషయాలు తెలుసుకోండి. వంటనూనె గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
నూనె తాజాగా ఉందా లేదా? అనే విషయాన్ని ఎంతో మంది పట్టించుకోరు. పాలు, బ్రెడ్ లాగా నూనెకు కూడా ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. కాకపోతే ఇది రెండు మూడు రోజుల్లో పాడవ్వదు. అలాగని నూనెను నెలల తరబడి వాడకూడదు. గాలి, వెలుతురు, వేడి తగలడం వల్ల నూనెలో ఆక్సిడేషన్ ప్రక్రియ జరుగుతుంది. కొన్ని రోజులకు అది పాతగా మారి వాసన రావచ్చు. పాతబడిన నూనె వాడితే వెంటనే ప్రభావం కనిపించదు. దీర్ఘకాలంలో ఫ్రీ రాడికల్స్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.
23
నూనె ఎక్స్ పైరీ డేట్
నూనెకు కూడా ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. అయితే వేర్వేరు నూనెల రకాన్ని బట్టి వాటి జీవితకాలం మారుతూ ఉంటుంది. రిఫైన్డ్ వెజిటబుల్ లేదా కెనోలా ఆయిల్ మూత తెరవకపోతే 1-2 ఏళ్లు వాడొచ్చు. తెరిచాక 6-12 నెలల్లో వాడేయాలి. ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ప్యాక్‌లో 24 నెలలు నిల్వ ఉంవచ్చు. అదే మూత తెరిచాక 3-6 నెలలు తాజాగా ఉంటుంది. కొబ్బరి నూనెను సుమారు 2 ఏళ్లు వాడొచ్చు. నువ్వుల నూనె మూత తెరిచాక 6 నెలలు, అవిసె గింజల (ఫ్లాక్స్‌సీడ్) నూనె ప్యాక్ తెరిస్తే 6-8 నెలలు వాడొచ్చు. తెరిచిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది. అవకాడో నూనె తెరిచాక 6 నెలల వరకు వాడుకోవచ్చు.
33
పాడైన నూనెను ఎలా గుర్తుపట్టాలి?
నూనె పాడైందో లేదో తెలుసుకునేందుకు చిన్ని చిట్కాలు పాటించాలి. ముందుగా నూనె వాసన చూడండి. పుల్లగా లేదా వింత వాసన వస్తే అది పాడైనట్లే. రుచి చేదుగా, పుల్లగా లేదా సబ్బులా అనిపించినా వాడొద్దు. నూనె రంగు మారడం, అడుగున ముక్కలు చేరడం లేదా మామూలు కంటే చిక్కగా మారడం కూడా నూనె పాడైందనడానికి సంకేతాలే. నూనె కొనేటప్పుడు ప్యాకెట్‌పై ఉన్న 'Best Before' లేదా 'Use By' తేదీని తప్పకుండా చెక్ చేయండి. బాటిల్ మూత తెరిచిన తేదీని గుర్తుపెట్టుకుంటే, సరైన సమయం వరకు నూనెను సురక్షితంగా వాడుకోవచ్చు.