స్వీట్ కార్న్ ఉడకబెట్టుకుని తిన్నా, కాల్చుకుని తిన్నా రుచిగానే ఉంటుంది. మొక్కజొన్న పండించడానికి పెద్ద పొలం అవసరం లేదు. మీ బాల్కనీ లేదా టెర్రస్‌పై కుండీల్లోనే వీటిని పండించవచ్చు. మొక్కజొన్న పెంచడానికి ముందుగా సరైన కుండీ ఎంపిక చేసుకోవాలి. మొక్కజొన్న మొక్క వేర్లు లోతుగా వెళ్తాయి. కాబట్టి, కనీసం 16 నుంచి 18 అంగుళాల లోతు, అంతే వెడల్పు ఉన్న కుండీ తీసుకోవాలి లేదా పెద్ద సైజు 'గ్రో బ్యాగ్' ఎంచుకున్నా మంచిదే. మొక్కజొన్నలో ఫలదీకరణ బాగా జరగాలంటే, కనీసం 4 నుంచి 6 మొక్కలను ఒకేచోట పెంచడం మంచిది.