విద్యుత్ ఉపకరణాలకు దూరంగా ఉండాలి...
మంచం కింద కరెంట్ కి సంబంధించిన వస్తువులు, హీటర్లు, ఐరన్ బాక్స్‌లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంచడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే, దూళి పేరుకుపోవడం వల్ల వైర్లు వేడెక్కి స్పార్క్స్ ఏర్పడి మంటలకు దారితీయవచ్చు. అంతేకాదు, తేమ ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ కి సంబంధించిన వస్తువులను ఉంచడం షార్ట్ సర్క్యూట్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల, వీటిని మంచం కింద ఎప్పుడూ ఉంచకండి.
ఆయుధాలు, పదునైన వస్తువులు
కొంతమంది స్వీయ రక్షణ కోసం ఆయుధాలు లేదా పదునైన వస్తువులను మంచం కింద దాచుకుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకర అలవాటు. ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇళ్లలో, ఈ వస్తువులు ఉంచడం మంచిది కాదు. వీటిని ఎల్లప్పుడూ తాళం వేసిన క్యాబినెట్‌లో లేదా పిల్లలకు అందని ప్రదేశంలో ఉంచాలి.