టైప్ 2 డయాబెటీస్ నియంత్రణలో ఉండాలంటే వీటిని తినండి

First Published Dec 3, 2022, 3:03 PM IST

ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం వంటివి టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని పెంచుతాయి. రక్తంలో చక్కెర, రక్తపోటు, రక్త లిపిడ్ స్థాయిలను నియంత్రించడం ద్వారా డయాబెటీస్ సమస్యలను తగ్గించుకోవచ్చు.
 

ప్రపంచవ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. కొన్ని సంవత్సరాలలో భారతదేశం డయాబెటీస్ రోగుల సంఖ్య దారుణంగా పెరుగుతోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. డయాబెటిస్  లో అత్యంత సాధారణ రకం టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్.. డయాబెటిస్ అట్లాస్ 2021 ప్రకారం.. భారతదేశంలో 20 నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సున్న మధుమేహుల సంఖ్యం 2021 లో 74.2 మిలియన్లుగా ఉంటే.. ఇది 2045 నాటికి 124.9 మిలియన్లకు పెరుగుతుందని భావిస్తున్నారు.
 

ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం టెప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని పెంచుతాయి. రక్తంలో చక్కెర, రక్తపోటు, రక్త లిపిడ్ స్థాయిలను బాగా నియంత్రించడం ద్వారా డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని తగ్గించొచ్చు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించొచ్చు. టైప్ -2 డయాబెటిస్ ను నియంత్రించడానికి మీ ఆహారంలో ఎలాంటి స్నాక్స్ ను చేర్చాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

బాదం

టైప్ -2 డయాబెటిస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు బాదం పలుకులు మంచి మెడిసిన్ లా ఉపయోగపడతాయి. రోజూ 30 గ్రాముల బాదంపప్పు తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా బాదం పప్పులను తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ లో వచ్చే హృదయనాళ సమస్యలు తగ్గుతాయని ఢిల్లీలోని న్యూట్రిషన్ రీసెర్చ్ గ్రూప్ సెంటర్ ఫర్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిక్ రీసెర్చ్ డాక్టర్ సంజీవ్ కుమార్ చెప్పారు. బాదం పప్పులను సలాడ్లలో లేదా నానబెట్టి తినొచ్చు. 
 

పచ్చి బీన్స్

పచ్చి బీన్స్ ను తింటే కూడా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇవి మీ అతి ఆకలిని తగ్గిస్తాయి. అలాగే మీరు తినే మొత్తాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. ఒక అధ్యయనంలో.. ఆరు వారాల పాటు పచ్చి శెనగతో చేసిన భోజనం తిన్న 19 మంది పెద్దలు గోధుమలతో చేసిన భోజనం తిన్న వారి కంటే రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలు తక్కువగా ఉన్నాయట. కాయధాన్యాలు సలాడ్ లో ఇతర రూపాలో తినొచ్చు. 
 

curd

పెరుగు

ఆరోగ్యకరమైన ఆహారాల్లో పెరుగు ఒకటి. పెరుగులో ఎన్నో రకాల ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. పెద్దవారు పెరుగును తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని ఒక అధ్యయనం కనుగొంది. పెరుగు తినని వారితో పోలిస్తే 80-125 గ్రాముల పెరుగును తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం 14 శాతం తక్కువగా ఉందని తేలింది. పెరుగులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది గట్ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలను చూపుతుంది. ఇది మధుమేహాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. రుచికరమైన పెరుగుకు బదులుగా చక్కెర కలపని సాదా పెరుగు తినండి. 

click me!