గుడ్లను ఎలా తింటే మంచిది?

First Published Dec 3, 2022, 1:58 PM IST

గుడ్లు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. అయితే ఆమ్లేట్, గుడ్డు కూర, గుడ్డు పుసులు అంటూ గుడ్లతో రకరకాల వంటలను తయారుచేసుకుని తింటారు. నిజానికి గుడ్డు నుంచి ఎక్కువ ప్రయోజనాలను పొందాలంటే మాత్రం వీటిని ఇలాగే తినాలని నిపుణులు చెబుతున్నారు. 
 

egg

గుడ్లతో కలిగే ప్రయోజనాలు అన్నీ.. ఇన్నీ కాదు.. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అంటారు. గుడ్లలో కాల్షియం, ప్రోటీన్, వంటి ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్లను రోజూ తినడం వల్ల ఎన్నోఆరోగ్య ప్రయోజనాలను పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇదంతా బానే ఉన్నా.. గుడ్లను ఎలా తింటే ప్రయోజనాలు కలుగుతాయన్న డౌట్ చాలా మందికి వస్తుంటుంది. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. 

egg

ఉడికించిన గుడ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు: గుడ్లను ఆమ్లేట్, కూరగా కాకుండా ఉడికించే ఎక్కువగా తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే.. 

గుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి

ఒక పెద్ద ఉడికించినన గుడ్డులో 77 కేలరీలు ఉంటాయి. అలాగే విటమిన్ ఎ, విటమిన్ బి5, విటమిన్ బి12, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి6, ఫోలేట్, సెలీనియం, భాస్వరం, సున్నము, జింక్, ఆరు గ్రాముల ప్రోటీన్, ఐదు గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. 
 

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

గుడ్డు లీన్ ప్రోటీన్, అమైనో ఆమ్లాలకు మంచి మూలం. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గేందుకు ఎంతో సహాయపడుతుంది. చలికాలంలో బద్దకం, చల్లని గాలుల వల్ల వ్యాయామం చేయకపోవచ్చు. ఇలాంటి వారికి గుడ్డు బాగా ఉపయోగపడుతుంది. 

గుడ్లు మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి

గుడ్లు మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి ఎంతో సహాయపడతాయి. మంచి కొలెస్ట్రాల్ పెరిగితే చెడు కొలెస్ట్రాల్ ఆటోమెటిక్ గా తగ్గుతుంది. ఈ మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు మన శరీరంలో ఎక్కువగా ఉంటే గుండె పోటు, స్ట్రోక్, గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గుడ్లు మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచవు. 
 

రోగనిరోధక శక్తిని పెంచుతాయి

గుడ్డులో జింక్ తో పాటుగా విటమిన్ బి6, విటమిన్ బి12 లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఫ్లూ, జలుబును తగ్గించడానికి కూడా సహాయపడతాయి. చలికాలంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండటం చాలా ముఖ్యం. రోజుకు ఒక ఉడకబెట్టిన గుడ్డును తినడం వల్ల జలుబు, ఫ్లూ, దగ్గు వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు. 
 

కంటిచూపును మెరుగుపరుస్తుంది

గుడ్డులోని పచ్చసొనలో ఎక్కువ మొత్తంలో లుటిన్, జియాక్సంతిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటిశుక్లం, కళ్లలో మాక్యులర్ క్షీణత ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు, గుడ్లలో విటమిన్ ఎ కూకడా పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.   
 

click me!