Heart Attack: ఉదయాన్నే మీరు చేసే ఈ తప్పులు గుండెపోటు ప్రమాదాన్ని పెంచేస్తాయి, జాగ్రత్త

Published : Oct 18, 2025, 02:53 PM IST

ఉదయం పూట మీరు చేసే కొన్ని పనులు గుండె సమస్యలను (Heart attack) తెచ్చిపెడతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచే పనులు ఏమిటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.  

PREV
16
ఉదయాన చేయకూడని పనులు

ఉదయం  పూట మన చేసే పనులు రోజంతా ప్రభావం చూపిస్తాయి. నిద్రలేచాక కొన్ని నిమిషాలు లేదా గంటల పాటూ గుండెపై ప్రభావం ఉంటుంది. ఉదయం పూటే ఎక్కువ మంది గుండె పోటు సమస్యలు వస్తూ ఉంటాయి కూడా. ఉదయం పూట ఎలాంటి పనులు చేస్తే గుండె పోటు వచ్చే అవకాశం అధికంగా మారుతుందో తెలుసుకోండి.

26
నీరు తాగండి

రాత్రి నిద్రలో మనం తరచూ నీటిని తాగము. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. కాబట్టి ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాసు నీళ్లు తాగాలి. లేకపోతే రక్తం చిక్కగా మారుతుంది. దీనివల్ల ఆ రక్తాన్ని పంప్ చేసేందుకు గుండె మరింత ఒత్తిడితో పంప్ చేయాలి. ఇది రక్తపోటును పెంచేస్తుంది. కాబట్టి ఉదయం లేచాక టీ, కాఫీలు తాగే అలవాటు ఉంటే వెంటనే వదిలేయండి. అవి తాగితే గుండె ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి గ్లాసు నీళ్లు తాగితే మంచిది.

36
అతి వ్యాయామం

ఉదయంపూట వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తారు. అలా అని  అతిగా వ్యాయామం చేయడం మాత్రం మంచిది కాదు. ఇది గుండెకు  చాలా ప్రమాదకరం. నిద్రలేవగానే రక్తనాళాలు గట్టిగా ఉన్నప్పుడు ఉంటాయి. ఆ సమయంలో అతిగా వ్యాయామం చేస్తే ఉదయాన్నే ఆకస్మిక గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఉదయం నిద్ర లేచాక సులభమైన  స్ట్రెచింగ్ వ్యాయామాలు లేదా వాకింగ్ చేయడం మంచిది.

46
బీపీతో జాగ్రత్త

అధిక రక్తపోటు చాలా డేంజర్. దీన్ని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఉదయం పూట రక్తపోటు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బీపీని ఉదయం పూట చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.  బీపీ అధికంగా ఉంటే గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. 

56
వీటిని తినకండి

బయట దొరికే ఆహారం ఆరోగ్యానికి హాని చేస్తుంది.  కానీ ఉదయాన్నే నిల్వ పచ్చళ్లు, బ్రెడ్,  ఉప్పు అధికంగా ఉంటే ఆహారాలను మాత్రం తినకూడదు. సోడియం అధికంగా ఉండే అల్పాహారం బీపీని పెంచుతుంది. అప్పుడు గుండె పోటు వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ లో పండ్లు, ఓట్స్ వంటివి తినడం మంచిది.

66
ఒత్తిడి వద్దు

ఉదయంపూట  ఒత్తిడి హార్మోన్లు అధికంగానే విడుదలవుతాయి. ముఖ్యంగా ఫోన్లు, ల్యాప్ టాప్ లు చూసేవారికి ఒత్తిడి పెరిగి గుండెపై భారం కూడా పెరగుతుంది. నిద్రలేవగానే ఇమెయిల్స్ చెక్ చేయడం, సోషల్ మీడియా చూడటం వంటివన్నీ చేయకూడదు. వీటివల్ల కార్టిసాల్ పెరిగి బీపీ పెరుగుతుంది. ఇది గుండె పోటును పెంచుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories