చాలా ఇళ్లల్లో ప్రెషర్ కుక్కర్ పేలిపోయే సంఘటనలు వినే ఉంటారు. అవి బాంబుల్లా పేలి ఇంటిళ్లపాది భయపడతాయి. ప్రెషర్ కుక్కర్ వినియోగించడానికి ముందు ఐదు విషయాలను గుర్తు పెట్టుకోండి. అప్పుడు అవి పేలకుండ ఉంటాయి.
ప్రెషర్ కుక్కర్‌తో వంట చేయడం చాలా సులువు. పప్పయినా, అందమైన ఏవైనా సులభంగా ఉడికిపోతాయి. అయితే దీంతో వంట చేసేటప్పుడు కొన్ని విషయాలను జాగ్రత్తగా గమనించాలి. లేకుంటే ఇది పేలే అవకాశం ఉంటుంది. దీని వల్ల దగ్గరలోని వస్తువులు పాడవడమే కాదు.. మనుషులు ఉంటే వారు కూడా గాయం పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రెషర్ కుక్కర్లో వంట చేసేటప్పుడు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
25
ఈ చిట్కాలు పాటించండి
మీ ప్రెషర్ కుక్కర్ సామర్ధ్యాన్ని బట్టి అందులో ఆహార పదార్థాలను వేయండి. కుక్కర్ సామర్ధ్యాన్ని సాధారణంగా లీటర్లలో చెబుతారు. కాబట్టి దాన్ని సామర్ధ్యానికి మించి ఆహారాన్ని వేయకండి. దీనివల్ల కూడా పేలుడు సంభవించే అవకాశం ఉంది. కుక్కర్లో ఎప్పుడైతే మీరు ఎక్కువ పదార్థాలను నింపుతారో అది అంతగా ఒత్తిడికి గురవుతుంది. దీనివల్ల ఆవిరి కూడా బయటికి రాదు. అప్పుడు కుక్కర్ పేలిపోయే అవకాశం ఉంది. కుక్కర్లో నాలుగింట మూడు వంతులు మాత్రమే నింపాలి. ఒక వంతు ఖాళీ ప్రదేశాన్ని వదిలేయాలి.
35
నీరు ఎక్కువ వేయండి
ప్రెషర్ కుక్కర్లో వంట చేయాలనుకునే వారు నీటి పరిమాణాన్ని సరిగ్గా వేయాలి. ఎక్కువ నీరు ఉంటే కుక్కర్ నుండి ఆ నీరు అంతా బయటికి వచ్చేస్తుంది. అదే తక్కువ నీరు ఉంటే ఆహార పదార్థాలు మాడిపోయే అవకాశం ఉంది. ఆ సమయంలో కూడా కుక్కర్ పేలిపోయే అవకాశం ఉంటుంది.
ప్రెషర్ కుక్కర్‌ను పరిశుభ్రంగా కడిగిన తర్వాతే దానిలో వంట చేయాలి. కుక్కర్ వెంట్ లో చెత్త చిక్కుకుపోయిన కూడా కుక్కర్ పేలిపోయే అవకాశం ఉంది. కాబట్టి కుక్కర్ ను పరిశుభ్రంగా క్లీన్ చేయండి. విజిల్‌తో సహా అన్నింటినీ క్లీన్ చేసి ఉంచాలి. అలాగే కుక్కర్ మూతపై విజిల్ పెట్టడానికి ఉన్నచోట ఒక రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం లోపల కూడా ఏవీ చిక్కుకు పోకుండా చూసుకోవాలి.
కొంతమంది ప్రెషర్ కుక్కర్ ను స్టవ్ ఆపిన వెంటనే బలవంతంగా తెరవడానికి ప్రయత్నిస్తారు. ఇలా చేస్తే అది పేలిపోయే అవకాశం ఉంటుంది. గ్యాస్ ఆపాక కనీసం పావుగంట పాటు కుక్కర్ ని ఓపెన్ చేయకూడదు. అందులో ఉన్న ఒత్తిడి మొత్తం బయటికి పోయాక అప్పుడు దాన్ని తెరవాలి. లేకపోతే ఒత్తిడి కారణంగా అది పేలిపోయే అవకాశం ఉంటుంది.
55
ఇవి కారణాలు కావచ్చు
సాధారణంగా ప్రెషర్ కుక్కర్ పేలడానికి కారణాలు. అందులో పెట్టే రబ్బర్ విరిగిపోయినా లేదా విజిల్ పాడైపోయినా, సేఫ్టీ వాల్వ్‌లో లోపం ఉన్నా, రెగ్యులేటర్ వాల్వ్ బరువు తక్కువగా ఉన్నా జరుగుతూ ఉంటుంది. నాణ్యతలేని కుక్కర్లను కొనడం వల్ల కూడా ఇలాంటివి జరగవచ్చు. పాత కుక్కర్లు కూడా పేలుడుకు కారణం అవుతాయి.