ఇలా చేస్తే పాత డ్రెస్ లు కొత్త వాటిలా కనిపిస్తాయి

Published : Aug 28, 2025, 11:32 AM IST

కొన్ని రోజులకు డ్రెస్ లు పసుపు రంగులోకి మారి పాతవాటిలా కనిపిస్తాయి. కానీ కొన్ని చిట్కాలతో వీటిని తిరిగి కొత్తవాటిలా కనిపించేలా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

PREV
14
క్లీనింగ్ చిట్కాలు

దుస్తులను ఎక్కువ సార్లు ఉతికితే అవి పసుపు రంగులోకి మారిపోతాయి. అలాగే ముడత పడి పాతవాటిలా కనిపిస్తాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో మీరు ఈ పాత దుస్తులను తిరిగి కొత్త వాటిలా కనిపించేలా చేయొచ్చు.

దుస్తులు పసుపు రంగులోకి ఎందుకు మారతాయి?

చాలా కాలం ఉపయోగించిన దుస్తులు ఖచ్చితంగా పసుపు రంగులోకి మారుతాయి. అలాగే వాటి నుంచి వింతైన వాసన కూడా వస్తుంది. అలాగే మురికిగా కూడా కనిపిస్తాయి. ఇలాంటి వాటిని తీసి పక్కన పెట్టేస్తుంటాం. కానీ కొన్ని సింపుల్ ఇంటి చిట్కాలతో పాత వాటిని కొత్తవాటిలా కనిపించేలా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

24
బేకింగ్ సోడా,వెనిగర్

బేకింగ్ సోడా, వెనిగర్ తో పాత దుస్తులను కొత్తవాటిలా చేయొచ్చు. ఈ మిశ్రమం పాత దుస్తులకున్న పసుపు రంగును తొలగిస్తుంది. అలాగే దుస్తులను శుభ్రంగా చేసి , కొత్తవాటిలా కనిపించేలా చేస్తుంది. ఇందుకోసం గోరువెచ్చని బకెట్ నీళ్లలో రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా, కప్పు వైట్ వెనిగర్ ను పోసి బాగా కలపండి. దీనిలో పాత దుస్తులను 30 నిమిషాలు నానబెట్టండి. ఇది దుస్తులకున్న పసుపు రంగును తొలగిస్తుంది.

34
నిమ్మరసం, ఉప్పు

ఉప్పు, నిమ్మరసంతో కూడా దుస్తులకున్న పసుపు రంగును తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. నిమ్మరసంలో ఉండే బ్లీచింగ్ గుణాలు దుస్తులకున్న పసుపు రంగును సులువుగా తొలగించేస్తుంది. అలాగే దుస్తులకున్నమురికి వాసన కూడా తొలగిపోతుంది. 

ఇందుకోసం బకెట్ వేడి నీళ్లలో రెండు నిమ్మకాయల రసాన్ని టీస్పూన్ ఉప్పును వేసి కలపాలి. దీనిలో దుస్తులను గంట లేదా రెండు గంటలు నానబెట్టి శుభ్రమైన నీళ్లతో వాష్ చేయండి. తర్వాత ఎండలో ఆరబెట్టండి. అంతే దుస్తుకున్న పసుపు రంగు పూర్తిగా పోతుంది.

44
హైడ్రోజన్ పెరాక్సైడ్

హైడ్రోజన్ పెరాక్సైడ్ తో వైట్ డ్రెస్ లను కొత్తవాటిలా చేయొచ్చు. తెల్ల దుస్తులకున్న మరకలు పోవాలంటే దీన్ని ఉపయోగించండి. చిటికెలో తొలగిపోతాయి. అంతేకాదు ఇవి దుస్తులను బాగా శుభ్రపరుస్తుంది. దీనివల్ల దుస్తులకు కొత్త లుక్ వస్తుంది. కొత్తవాటిలా మెరిసిపోతాయి. 

ఇందుకోసం అరకప్పు హైడ్రోజన్ పెరాక్సైడ్ ను వాషింగ్ మెషిన్ లో వేయండి. వైట్ డ్రెస్సులను నార్మల్ పద్దతిలో వాష్ చేయండి. ఇది వైట్ డ్రెస్సును కొత్తవాటిలా చేయడానికి సహాయపడుతంది.

Read more Photos on
click me!

Recommended Stories