ఈ పండ్లు తింటే నెలసరి టైం ప్రకారమే అవుతుంది..

Published : Sep 10, 2022, 12:55 PM IST

చాలా మంది ఆడవారికి నెలసరి టైం  ప్రకారం కాదు. రెండు మూడు నెలలకోసారి అయ్యేవారు కూడా ఉన్నారు. కానీ ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే కొన్నిరకాల పండ్లు పీరియడ్స్ రెగ్యులర్ గా అయ్యేందుకు సహాయపడతాయి. 

PREV
18
  ఈ పండ్లు తింటే నెలసరి టైం ప్రకారమే అవుతుంది..

చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, పనిభారం, శరీరక శ్రమ లేకపోవడం, థైరాయిడ్, గర్భనిరోధక ట్యాబ్లెట్లను వేసుకోవడం వంటి వివిధ కారణాల వల్ల నెలసరి టైం ప్రకారం కాదు. కానీ  ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎన్నో ప్రమాదకరమైన సమస్యలకు దారి తీస్తుంది. అందుకే ఈ సమస్య వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది. అయితే కొన్ని రకాల పండ్లు కూడా  పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి సహాయపడతాయి.

28

కొంతమంది ఆడవారికి పీరియడ్స్ మూడు నాలుగు నెలలైనా కావు. సాధారణంగా పీరియడ్స్ 28 రోజులకే రావాలి. అయితే ఈ పీరియడ్స్ 35 రోజులు దాటినా కాలేదంటే దాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు. పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పి, బ్లీడింగ్  తక్కువగా ఉండటం వంటి కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కిందికే వస్తాయి. 

38

అయితే ఈ ఇర్రెగ్యుర్ పీరియడ్స్ రక్తహీనత వల్ల కూడా వస్తాయని NCBI నివేదిక స్పష్టం చేసింది. ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, పిల్లలు పుట్టకపోవడం, ఎండోమెట్రియల్ హైపర్ ప్లాసియా, బోలు ఎముకల వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నెలసరి సక్రమంగా కాని వారు ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. అలాగే మంచి ఆహారాలను అలవాటు చేసుకోవాల. ఏ పండ్లు తింటే పీరియడ్స్ రెగ్యులర్ గా అవుతాయో తెలుసుకుందాం పదండి. 

48

ఆరెంజ్

సిట్రస్ ఫ్రూట్ అయినా ఆరెంజ్ లో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది పీరియడ్స్ సరిగ్గా కాకుండా చేసే ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. ఈ విటమిన్ సి ఒక్క ఆరెంజ్ పండ్లలోనే కాదు.. నిమ్మ, మామిడి, కివి, బొప్పాయి పండ్లలో కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లను తింటే పీరియడ్స్ రెగ్యులర్ గా అవుతాయి. 
 

58

ఉసిరి

ఉసిరిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలుంటాయి. ఇవి జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే వీటిని రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తుంటారు. ఉసిరిని తినడం వల్ల ఇర్రెగ్యులర్ సమస్య కూడా పోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఉసిరి జ్యూస్ ను తాగాలని సలహానిస్తున్నారు. 
 

68

దానిమ్మ

దానిమ్మలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ముఖ్యంగా ఆడవారు ఈ పండ్లను తింటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తగ్గడంతో పాటుగా అధిక రక్తస్రావం సమస్య కూడా తగ్గిపోతుంది. రోజూ ఒక దానిమ్మ పండునున తింటే నెలసరి సక్రమంగా అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 
 

78

పైనాపిల్

పైనాపిల్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే బ్రోమెలైనే అనే ఎంజైమ్ గర్భాశయం లైనింగ్ ను తొలగిస్తుంది. ఈ పైనాపిల్ జ్యూస్ ను తాగితే తెల్ల రక్త కణాలే కాదు.. ఎర్ర రక్తకణాల కూడా బాగా పెరుగుతాయి. పీరియడ్స్ సమయానికి అవుతాయి. అంతేకాదు అధిక రక్తస్రావం అయ్యే అవకాశం కూడా తగ్గుతుంది. 

88
banana

అరటిపండ్లు

అరటిపండ్లను ఇష్టపడనివారుండరు. చవక ధరకు లభించినా.. వీటిలో ఎన్నో పోషకాలుంటాయి. ఈ పండ్లలో ఉండే విటమిన్ బి6, పొటాషియం జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.  రోజూ ఒక అరటిని తింటే పీరియడ్స్ సక్రమంగా అవుతాయి. మూడ్ స్వింగ్స్ కూడా ఉండవు. 
 

Read more Photos on
click me!

Recommended Stories