భోజనం చేసిన తర్వాత తమలపాకు తింటే ఏమౌతుందో తెలుసా..?

First Published Sep 10, 2022, 11:59 AM IST

తమలపాకుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అందుకే వీటిని ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తూ వస్తున్నారు. భోజనం చేసిన తర్వాత దీన్ని తింటే ఎన్నో ప్రయోజనాలను పొందుతారు.
 

తమలపాకులు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.. ఈ ఆకులు ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అందుకే మన తాతలు, ముత్తాల కాలం నుంచి వీటిని ఉపయోగిస్తూ వస్తున్నారు. సాధారణంగా చాలా మందికి భోజనం చేసిన తర్వాత వీటిని తినే అలవాటుంటుంది. ఈ ఆకులను పెళ్లిళ్లు, పేరంటాలకు కూడా ఉపయోగిస్తారు. 
 

ఈ తమలపాకుల్లో నియాసిన్, కెరోటిన్, విటమిన్ సి, రైబోఫ్లావిన్, కాల్షియం వంటి ఎన్నో పోషకాలుంటాయి. ఇవి మన శరీరాన్ని ఎన్నో విధాలుగా రక్షిస్తాయి. అవేంటంటే..

తమల పాకు ఎలాంటి నొప్పులనైనా ఇట్టే తగ్గించగలదు. అలాగే జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. చలికాలంలో తమలపాకును తింటే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. 

తమలపాకుల్లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరానికి హాని కలిగించే ఫ్రీరాడికల్స్ నుంచి మనల్ని రక్షిస్తాయి. ఉదర సమస్యలను కూడా పోగొడుతాయి. 

మలబద్దకం సమస్యతో బాధపడేవారికి తమలపాకు మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది మలబద్దకం సమస్యను పోగొడుతుంది. దీన్ని తినడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. రక్తప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుంది. 

తమలపాకు జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందది. ఆస్తమా, ఛాతి నొప్పిని తగ్గించడానికి కూడా తమల పాకులు ఉపయోగపడతాయి. 

తమలపాకుల్లో పుష్కలంగా ఉండే పాలీఫెనాల్స్ మనల్ని ఎన్నో రకాల క్రిమికీటకాల నుంచి రక్షణ కల్పిస్తాయి. పలు అధ్యయనాల ప్రకారం.. తమలపాకు వేసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇవి టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లకు ప్రయోజకరంగా ఉంటాయి. 
 

తమలపాకుల్లో ఉండే ఔషదగుణాలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంటను, గాయాలు, వాపును తగ్గిస్తాయి. తమలపాకులను వేసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇది డిప్రెషన్ నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. 
 

ఆకలి లేనివారికి ఇది మెడిసిన్ లా పనిచేస్తుంది. కొద్దిగా ఆకుముక్కను తీసుకుని నమిలితే ఆకలి బాగా అవుతుందట. ఈ ఆకులు కడుపు ఉబ్బరాన్ని కూకడా తగ్గిస్తాయి. ఇందుకోసం గ్లాస్ పాలలో చేతితో నలిపిన రెండు ఆకులను మిక్స్ చేసి తాగాలి. 

తలనొప్పి, మైగ్రేన్ నొప్పిని తగ్గించడంలో తమలపాకులు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం తమలపాకు నుంచి రసం తీసి దానితో నుదురుకు మసాజ్ చేయాలి. కొద్ది సేపట్లోనే తలనొప్పి మటుమాయం అవుతుంది. 

click me!