నల్ల జామకాయలలో ఖనిజాలు, విటమిన్స్, ఐరన్, కాల్షియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఈ నల్లజామ పండ్లు తినడం వల్ల శరీరంలో రక్త శాతం పెరిగి రక్తహీనత సమస్య దూరం అవుతుంది. అంతేకాకుండా ఈ నలుపు రంగు జామ పండ్లు తినడం వల్ల శరీరంలో రక్తం కూడా శుద్ధి అవుతుంది. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో అందరూ అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. జామ పండ్లలో యాంటీ ఏజనింగ్ లక్షణాలు అధికంగా ఉంటాయి.