High bp: ఈ పండ్లతో హై బీపీకి చెక్ పెట్టండి..

Published : May 22, 2022, 02:32 PM IST

High bp: అధిక రక్తపోటు ఉన్న వారు కొన్ని రకాల పండ్లను, కూరగాయలను క్రమం తప్పకుండా తినాలని వైద్యులు సలహా ఇస్తారు. మార్కెట్ లో సులువుగా దొరికే ఈ ఐదు పండ్లు హైబీపీని దూరం చేస్తాయి. 

PREV
18
High bp: ఈ పండ్లతో హై బీపీకి చెక్ పెట్టండి..

ఈ ఆధునిక జీవితంలో అధిక రక్తపోటు ఒక సాధారణ వ్యాధిగా మారిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు దీని బారిన పడుతున్నారు. ఈ వ్యాధి యొక్క ప్రారంభ లక్షణాలు అస్సలు కనిపించవు. దీనివల్లే చాలా మందికి దీని బారిన పడ్డాక కూడా తెలియడం లేదు. అందుకే ఈ వ్యాధిని ‘సైలెంట్ కిల్లర్’(Silent killer) అని కూడా పిలుస్తారు. Indian Council for Medical Research ప్రకారం..  భారతదేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి అధిక రక్తపోటు ఉంది.

28

అధిక రక్తపోటు అంటే ఏమిటి? 

ఇది గుండె నుండి శరీరంలోని ఇతర భాగాలకు రక్తాన్ని తీసుకువెళ్ళే ధమనులలో రక్తపోటును పెంచే పరిస్థితి. దీంతో మూత్రపిండాలు, ఊపిరితిత్తులు మరియు గుండె దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సాధారణంగా 30-70 సంవత్సరాల వయస్సు ఉన్నవారిలో కనిపిస్తుంది. అయితే ఈ వ్యాధిని ముందుగానే గుర్తిస్తే సరైన చికిత్స తీసుకుని తగ్గించుకోచ్చు. 

38

అయితే కొన్ని రకాల పండ్లు, కూరగాయలు రక్త పోటును తగ్గించడానికి ఎంతో సహాయడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

48

మామిడి పండ్లు (Mango fruits)..  పండ్లలో రారాజుగా ప్రఖ్యాతి గాంచిన  ఈ పండు టేస్ట్ లో అదిరిపోతుంది. ఈ రుచికరమైన మామిడి పండ్లు వేసవిలో పుష్కలంగా లభిస్తాయి. మామిడి పండ్లలో ఫైబర్, బీటా కెరోటిన్ మరియు పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.
 

58

నారింజ (Orange).. పుల పుల్లగా తీయ తీయగా ఉంజే ఈ జ్యూసీ పండును ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరేమో. ఈ పండు శరీరంలో రక్తపోటును సాధారణ స్థితిలో ఉంచడానికి సహాయపడుతుంది. ఇందులో అమైనో ఆమ్లాలు, ఫైబర్, కాల్షియం, అయోడిన్, ఫాస్పరస్, సోడియం, ఖనిజాలు, విటమిన్ ఎ,  విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతాయి. 
 

68

దానిమ్మ (Pomegranate).. సాధారణంగా దానిమ్మను తినడం వల్ల శరీరంలో రక్తహీనత (Anemia)సమస్య తగ్గుతుంది. దానిమ్మ ఏసీఈ ఎంజైమ్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రక్తనాళాల పరిమాణాన్ని నియంత్రిస్తుంది. రక్తపోటును కూడా తగ్గిస్తుంది. దీని పండు లేదా రసం రెండూ మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. 
 

78

అరటిపండు (Banana).. అరటి పండు మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. దీనిని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇది అధిక రక్తపోటు వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది. ఇందులో విటమిన్ ఎ, బి, బి6, సి, అలాగే ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, రిబోఫ్లేవిన్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి. జీర్ణ సంబంధ సమస్యల్లో కూడా దీనిని వినియోగిస్తారు.

88

కొబ్బరి నీరు (Coconut water).. శరీరంలో ఎలక్ట్రోలైట్ పరిమాణాన్ని సమతుల్యం చేయడానికి, శరీరంలో రక్తపోటు స్థాయిని నియంత్రించడానికి కొబ్బరి నీరు దివ్య ఔషదంలా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు కొబ్బరి నీటిని తాగడం వల్ల అధిక రక్తపోటును నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories