Weight Loss Drink: ఇదొక్కటి తాగితే చాలు బెల్లీ ఫ్యాట్ వెన్నలా కరిగిపోతుంది..

Published : May 22, 2022, 12:42 PM IST

Weight Loss Drink: బరువు తగ్గడానికి ఎన్నో ట్రిక్స్ ను ఫాలో అవుతుంటారు. అయినా ఆశించిన ఫలితాన్ని పొందకపోవచ్చు. అలాంటి వారికి ఈ పానీయం దివ్య ఔషదంలా పనిచేస్తుంది.   

PREV
17
Weight Loss Drink: ఇదొక్కటి తాగితే చాలు బెల్లీ ఫ్యాట్ వెన్నలా కరిగిపోతుంది..

కరోనా మహమ్మారి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఫెసిలిటీని కల్పించాయి. వైరస్ బారిన పడకుండా ఉండటానికి ఇది చక్కటి మార్గం అయినప్పటికీ.. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందులో తినడం ఒకే దగ్గర గంటల తరబడి కూర్చోవడం.. శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలా మంది అధిక బరువు బారిన పడ్డారు. ఇక ఈ బరువును తగ్గించుకోవడానికి ఎన్నో ట్రిక్స్ ను ఫాలో అవుతుంటారు. అయినా బరువు తగ్గని వారు చాలా మందే ఉన్నారు. కానీ బరువు తగ్గే ప్రాసెస్ చాలా నెమ్మదిగా జరుగుతుంది. 

27

బరువు పెరడగం వల్ల సోకే వ్యాధులు.. అధిక బరువు ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులకు దారి తీస్తుంది. బరువు పెరిగితే మధుమేహం తో పాటుగా రక్తపోటు కూడా విపరీంగా పెరుగుతుంది. అంతేకాదు ఇది గుండెపోటు కు కూడా దారితీస్తుంది. వీటితో పాటుగా వెన్ను నొప్పి, కడుపు నొప్పి, స్ట్రెచ్ మార్క్స్, బ్లాక్ హెడ్స్ వంటి  సమస్యలకు దారితీస్తుంది.
 

37

ఇలాంటి పరిస్థితిలో ఒక స్పెషల్ డ్రింక్ తాగితే.. బెల్లీ ఫ్యాట్ నెయ్యిలా కరుగుతుంది. అలాగే బరువు కూడా సులువుగా తగ్గుతారు. ఇంతకీ ఏ డ్రింక్ తాగాలో తెలుసుకుందాం పదండి. 
 

47
mint leaves

పుదీనా.. మండుతున్న ఎండలకు ఒంట్లో వేడి  విపరీతంగా పెరిగిపోతుంది. కాగా ఈ సీజన్ లో పుదీనాను తీసుకుంటే ఒంట్లో వేడి తగ్గడమే కాదు.. చలువ కూడా చేస్తుంది. ఇది బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులను తినడం వల్ల ఉదర సంబంధ సమస్యలు తగ్గుతాయి. కడుపు నొప్పి, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

57
mint drinks

పుదీనా నీళ్లతో బరువు తగ్గుతారు.. త్వరగా బరువు తగ్గాలంటే ఒక గ్లాస్ నీటిలో కొన్ని పుదీనా ఆకులను వేయాలి. అందులో నల్ల ఉప్పును, నల్లమిరియాలను బాగా గ్రైండ్ చేసి ఆ వాటర్ కలపాలి. క్రమం తప్పకుండా ఈ డ్రింక్ ను తాగితే మీ బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుంది. 

67

పుదీనా ఇతర ప్రయోజనాలు.. పుదీనా వాటర్ ను తాగడం వల్ల మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఇది ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తుంది. 

77

మలబద్దకం, హీట్ స్ట్రోక్ వంటి వడదెబ్బ వంటి అనారోగ్య సమస్యలను తగ్గించడానికి కూడా ఎంతో సహాయడుతుంది. కాబట్టి ఈ సీజన్ లో పుదీనా వాటర్ ను తప్పకుండా తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories