Breast Size : రొమ్ముల సైజ్ వీటి వల్ల కూడా పెరుగుతుంది..

First Published May 22, 2022, 1:35 PM IST

Breast Size : కొందరిలో ఉన్నట్టుండి రొమ్ము సైజ్ పెరుగుతుంది. ఇలా పెరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి. 
 

ఈ రోజుల్లో సినీ సెలబ్రీటీలతో పాటుగా ఇతర ఆడవారు కూడా శస్త్రచికిత్సలు చేయించుకుని తమ రొమ్ముల(Breast) సైజును పెంచుకుంటున్నారు. అంతేకాదు రొమ్ముల పరిమాణాన్ని పెంచడానికి సహాయపడే అనేక సహజ ఉత్పత్తులు కూడా నేడు మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే కొంతమంది మహిళల రొమ్మల సైజ్ అకస్మత్తుగా పెరిగిపోతుంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. 
 

రొమ్ములు కొవ్వు కణాలతో తయారు చేయబడతాయి కనుక రొమ్ము పరిమాణం పెరగడానికి బరువు పెరగడం అనేది మొదటి ప్రధాన కారణం. రొమ్ము పరిమాణం పెరగడానికి అనేక ఇతర కారణాలు ఉన్నాయి. ఆ కారణాలేమిటో తెలుసుకుందాం...

రుతుస్రావం (Period)..

బహిష్టు సమయంలో అండోత్సర్గము తరువాత శరీరంలో ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మీ వక్షోజాలు పెద్దదిగా కనిపించడమే కాకుండా వాటిని మరింత సున్నితంగా చేస్తుంది. రుతుస్రావం ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందు రొమ్ము పరిమాణం పెద్దదిగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
 

గర్భాధారణ (Pregnancy)..

గర్భధారణ సమయంలో.. శరీరం వివిధ హార్మోన్ల మార్పులకు లోనవుతుంది. కాబట్టి గర్భధారణ సమయంలో రొమ్ము పరిమాణం పెరగడం సర్వ సాధారణం. గర్భధారణ సమయంలో రొమ్ము కణాలకు రక్త ప్రవాహం పెరుగుతుంది.  దీంతో రొమ్ములు పెద్దవిగా కనిపిస్తాయి. 
 

బరువు పెరగడం (Weight gain)..

చాలా మంది మహిళలు 3o ఏండ్లు దాటిన తరువాత వారి రొమ్ము పరిమాణం పెరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే.. రొమ్ముల్లో.. రొమ్ము కణజాలం, లోబ్యూల్స్ మరియు కొవ్వు కణజాలం ఉంటాయి. కాబట్టి మన శరీరం పెద్దదిగా మారినప్పుడు, అవి కూడా పెద్దవిగా మారతాయి.

సెక్స్ (Sex)..

ఫోర్ ప్లే మరియు సెక్స్ రొమ్ముల పరిమాణాన్ని పెంచుతాయి. మీరు సెక్స్ లో పాల్గొన్నప్పుడు రొమ్ముల పరిమాణం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

గర్భనిరోధక మాత్రలు (Contraceptive pills)..

గర్భనిరోధక మాత్రలు కూడా రొమ్ము పెరుగుదలకు కారణమవుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. క్రమం తప్పకుండా గర్భనిరోధక మాత్రలు తీసుకునే మహిళలు రొమ్ము పరిమాణంలో స్వల్ప పెరుగుదల కనిపింస్తుంది. జనన నియంత్రణ మాత్రల్లో హార్మోన్లు ఉంటాయి. అవి ఒక వ్యక్తి యొక్క రొమ్ము పరిమాణాన్ని పెంచుతాయి. ఈస్ట్రోజెన్ అనేది ఒక హార్మోన్. ఇది యుక్త వయస్సులో రొమ్ముల అభివృద్ధికి సహాయపడుతుంది. ఒక వ్యక్తి గర్భనిరోధక మాత్ర తీసుకోవడం ప్రారంభించినప్పుడు ఈ హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి. మెడికల్ న్యూస్ టుడేలో ప్రచురితమైన ఒక వ్యాసం ప్రకారం.. ఇది రొమ్ము పరిమాణం పెరగడానికి కారణమవుతుంది.

click me!