జ్వరం వచ్చిందా? త్వరగా తగ్గాలంటే ఇలా చేయండి..

Published : Oct 15, 2022, 10:41 AM IST

జ్వరం వచ్చిందంటే చాలు పాణమంతా ఏదోలా ఉంటుంది. శరీరంలో సత్తువ ఉండదు. ఏదీ తినాలనిపించదు. ఏది తిన్నా రుచిగా అనిపించదు. త్వరగా తగ్గితే బాగుండు అనిపిస్తుంది. కొన్ని టిప్స్ ను పాటిస్తే జ్వరం చాలా తొందరగా తగ్గిపోతుంది. అవేంటంటే..   

PREV
16
జ్వరం వచ్చిందా? త్వరగా తగ్గాలంటే ఇలా చేయండి..

ఈ సీజన్ లో జ్వరం ఎక్కువగా వస్తుంది. జ్వరం వచ్చాక.. ఇంకో భయం.. అసలు ఇది నార్మల్ ఫీవరా లేకపోతే డెంగ్యూ, టైఫాయిడ్, కరోనా, మలేరియా, వైరల్ ఫీవర్ వంటి రోగాల వల్ల వచ్చిందా అన్న అనుమాణాలు కలుగుతాయి. వీటిలో ఏది ఉన్నా జ్వరం కామన్. వీటిలో ఏది వచ్చిందో అన్న  ముచ్చట తెలియాలంటే సంబంధిత టెస్టుల తప్పకుండా చేయించుకోవాల్సిందే. కానీ జ్వరం వల్ల మన శరీరంలో ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో శరీరంలో శక్తి అసలే ఉండదు. దీంతో రోగం మరింత ఎక్కువవుతుంది. అందుకే జ్వరం తక్కువగా ఉన్నప్పుడే టాబ్లెట్లను వాడాలి. అలాగే కొన్ని రకాల ఆహారాలను తినాలి. అప్పుడే జ్వరం చాలా తొందరగా తగ్గిపోతుంది. నోటికి రుచి తెలియడం లేదని కారం కారంగా ఉండే వాటిని అసలే తినకూడదు. కొన్ని రకాల ఆహారాలను తింటే జ్వరం చాలా తొందరగా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం పదండి..

26
chicken soup

చికెన్ సూప్

జ్వరం వస్తే నాన్ వెజ్ జోలికి అసలే పోకూడదని చెప్తుంటారు పెద్దలు. ఒకవేళ తింటే జ్వరం ఎక్కువ అయితుందంటారు. నిజానికి జ్వరాన్ని తగ్గించడంలో చికెన్ సూప్ ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. వేడి వేడి చికెన్ సూప్ ను తాగితే టేస్టీగా ఉంటుంది. ఈ సూప్ లో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, కేలరీలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో సోడియం కూడా ఉంటుంది. ఇది ఎలక్ట్రోలైట్లను పెంచడానికి సహాయపడుతుంది. చికెన్ సూప్ తో శరీరంలో వాటర్ కంటెంట్ సమతుల్యంగా ఉంటుంది. దీంతో బాడీ టెంపరేచర్ తగ్గిపోతుంది. అంటే జ్వరం కూడా తగ్గుతున్నట్టే.. ఈ చికెన్ సూప్ ట్యాక్సిన్లను కూడా బయటకు పంపుతుంది. 
 

36

ఆకుకూరలు

ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ వీటిని తినే వారు చాలా తక్కువే.. కానీ వీటిని తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అందుకే జ్వరం వచ్చినప్పుడు పాలకూర, మునగాకు, తోటకూర, బచ్చలికూరను తినాలని డాక్టర్లు చెప్తుంటారు. ఈ ఆకుకూరల్లో ఐరన్, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జ్వరాన్ని చాలా త్వరగా తగ్గిస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 
 

46

కిచిడీ

కిచిడీని పప్పు, రకరకాల కూరగాయలో వండుతారు. దీనిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి.  కానీ కిచిడీని చూస్తేనే మొహం  అదోలా పెట్టేవారు చాలా మందే ఉన్నారు. కానీ కిచిడీని జ్వరం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే ఇది చాలా సులువుగా జీర్ణం అవుతుంది. రుచిగా లేకపోయినా దీన్ని తింటే మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. దీనితో పాటుగా ఇడ్లీని కూడా తినొచ్చు. ఇది తేలిగ్గా జీర్ణం అవుతుంది. 
 

56
fruits

పండ్లు

జ్వరంగా ఉన్నప్పుడు మాంసమే కాదు కొన్ని పండ్లను కూడా తినొద్దు అంటుంటారు. ఇలాంటి సమయంలో ఫ్రై చేసిన మాంసాలను తినకూడదు అన్న మాట నిజమే కానీ.. పండ్లను మాత్రం ఖచ్చితంగా తినొచ్చు. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆరెంజ్, ఆపిల్, దానిమ్మ వంటి పండ్లను ఎక్కువగా తినాలి. ఇవి మీ రోగనిరోధక శక్తిని పంచుతాయి. దీంతో జ్వరం ఫాస్ట్ గా తగ్గుతుంది. 
 

66

కొబ్బరి నీళ్లు

జ్వరం వచ్చినప్పుడు బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. టెంపరేచర్ తగ్గాలంటే నీటిని ఎక్కువగా తాగాలి. కానీ ఇలాంటి సమయంలో నీటిని ఎక్కువగా తాగాలనిపించదు. అందుకే నీళ్లకు బదులుగా కొబ్బరి నీళ్లను తాగండి. కొబ్బరి నీళ్లు మీ శరీరాన్ని తిరిగి హైడ్రేట్ చేస్తాయి. వీటిలో ఉండే న్యూట్రిషియన్లు బాడీ టెంపరేచర్ ను తగ్గిస్తాయి. దీంతో జ్వరం తగ్గిపోతుంది. 

 

Read more Photos on
click me!

Recommended Stories