కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలా? అయితే ఇలా చేయండి..

Published : Oct 14, 2022, 04:55 PM IST

కొంతమందికి కను బొమ్మలు  చాలా పల్చగా ఉంటాయి. ఇలాంటి వారు కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే.. కనుబొమ్మలు ఒత్తుగా, ధ్రుడంగా పెరుగుతాయి. అవేంటంటే..   

PREV
16
కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలా? అయితే ఇలా చేయండి..

కళ్లే అమ్మాయిలకు ప్రత్యేక ఆకర్షణ. ఆ కళ్లకు అందం కనుబొమ్మలు. కనుబొమ్మలు ఒత్తుగా, ఆకర్షణీయంగా ఉంటేనే అందం రెట్టింపు అవుతుంది. ఒకప్పుడు సన్నని కనుబొమ్మలను ఇష్టపడితే.. ఇప్పుడు ఒత్తైన కనుబొమ్మలనే ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు. ఐబ్రోస్ ఇలాగే చేయించుకుంటున్నారు. అయితే కొంతమందికి కనుబొమ్మలు చాలా పల్చగా ఉంటాయి. దీంతో కనుబొమ్మలు కనిపించేందుకు ఐబ్రో పెన్సిల్స్ ను యూజ్ చేస్తుంటారు. కానీ కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ పెన్సిల్స్ ను వాడాల్సిన అవసరం. కనుబొమ్మలు ఒత్తుగా సహజంగా పెరుగుతాయి. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం పదండి. 
 

26

కొబ్బరి నూనెతో మసాజ్

నూనె కూడా కనుబొమ్మలు పెరిగేందుకు.. అవి ఊడిపోకుండా చేసేందుకు సహాయపడతుంది. ప్రతిరోజూ నూనెతో మసాజ్ చేయడం కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి. ఇందుకోసం మీ వేలి కొనలకు కొద్దిగా కొబ్బరినూనెను అద్దుకుని కనుబొమ్మలపై అప్లై చేసి.. బాగా మసాజ్ చేయండి.  కొబ్బరి నూనె కనుబొమ్మలు ఊడిపోవడాన్ని ఆపడమే కాదు.. రక్త ప్రవాహాన్ని కూడా పెంచుతుంది. 
 

36

ఆముదం నూనె

కనుబొమ్మలు ఒత్తుగా అయ్యేందుకు సహాయపడే నూనెలలో ఆముదం నూనె ఒకటి. ఇందుకోసం ఆముదం నూనెలో ఒక కాటన్ క్లాత్ ను ముంచి రెండు కనుబొమ్మలపై బాగా రుద్దాలి. ఆ తర్వాత వేలికొనలతో రెండు లేదా మూడు నిమిషాలు బాగా మసాజ్ చేయండి. 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో లేదా చల్లటి నీటితో కడిగేయండి.
 

 

46

ఆలివ్ ఆయిల్

కనుబొమ్మలు పెరగడానికి ఆలివ్ ఆయిల్ కూడా సహాయపడుతుంది. ఇందుకోసం గోరువెచ్చని ఆలివ్ ఆయిల్ ను కనుబొమ్మలకు అప్లై చేసి బాగా మసాజ్ చేయండి.  ఆలివ్ నూనెకు కొద్దిగా తేనెను మిక్స్ చేసి కలిపి కూడా కనుబొమ్మలకు పెట్టొచ్చు. రాత్రి పడుకునే ముందు మీ కనుబొమ్మలకు కొద్దిగా ఆలివ్ నూనెను రాయండి. ఉదయాన్నే చల్లటి నీటితో కడిగేయండి.
 

56

ఉల్లిపాయ రసం

ఉల్లిపాయ రసం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది హెయిర్ ఫాల్, తెల్ల వెంట్రుకలు వంటి జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఉల్లిరసం కనుబొమ్మలు త్వరగా పెరగడానికి కూడా సహాయపడుతుంది. దీని కోసం ఒక ఉల్లిపాయను తీసుకుని మిక్సీలో వేసి రసం తీయండి. దీనిని కనుబొమ్మలపై అప్లై చేసి.. ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయండి. 
 

66

గుడ్డు

గుడ్లలో ప్రోటీన్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ఇవి కనుబొమ్మలు పెరిగేందుకు ఎంతో సహాయపడతాయి. దీని కోసం ముందుగా గుడ్డు నుంచి తెల్లసొనను వేరు చేసి.. ఎల్లో సొనను బాగా కలపండి. ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ ను తీసుకుని ఎల్లో సొనలో ముంచి కనుబొమ్మలకు అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇవి మీ కను బొమ్మలు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడతాయి.  
 
 

Read more Photos on
click me!

Recommended Stories