టీ తో బ్రెడ్ ను తింటున్నారా? అదెంత డేంజరో తెలుసా?

First Published Oct 15, 2022, 9:43 AM IST

చాలా మంది టీతో బిస్కెట్లు, బ్రెడ్ లను ఎక్కువగా తింటుంటారు. పరిగడుపున టీ తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇక అందులో బ్రెడ్ ను ముంచుకుని తింటే ఏమైనా ఉందా.. ఎన్నో సమస్యలు వస్తాయి. 

ఛాయ్ ను తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. దేశంలో టీ తాగని వారు దాదాపుగా ఉండరేమో. ఇది లేకుండా రోజు కూడా స్టార్ట్ కాదు. కొందరైతే టీ తాగిన తర్వాతే బెడ్ దిగుతుంటారు. టీలో ఉండే కెఫిన్ నిద్ర మత్తును వదిలిస్తుంది. శరీరాన్ని ఉత్సాహంగా మారుస్తుంది. శక్తిని అందిస్తుంది. అయితే కొంతమంది టీనే తాగితే.. ఇంకొందరు మాత్రం టీలో బిస్కట్లు, బ్రెడ్ ల అద్దుకుని తింటుంటారు. ఇది టేస్టీగా అనిపించినా.. ఆరోగ్యానికి టీ అస్సలు మంచిది కాదు. అందులో టీలో బ్రెడ్ ను తినడం ఇంకా ప్రమాదకరం. దీనివల్ల లేనిపోని రోగాలొచ్చే అవకాశం ఉంది. అవేంటంటే.. 

high blood pressure

రక్తపోటు పెరుగుతుంది

అధిక రక్తపోటుతో బాధపడేవారు టీ తో బ్రోడ్ ను తినడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది రక్తపోటును మరింత పెంచుతుంది. అలాగే ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. బ్రెడ్ లో ఉండే వివిధ పదార్థాలు రక్తపోటును పెంచుతాయి. 
 

అల్సర్

టీ, బ్రెడ్ ను కలిపి తింటే కడుపులో పెప్టిక్ అల్సర్ ఏర్పడుతుంది. అందుకే ఈ రెండింటి కాంబినేషన్ లో అసలే తినకూడదు. కొంతమందికి ఈ  కాంబినేషన్ లో టీ తాగడం వల్ల ఎసిడిటీ కూడా వస్తుంది. 
 

ఊబకాయం పెరుగుతుంది

మీకు టీ తో బ్రెడ్ ను తినడమంటే ఇష్టమా.. అయితే మీ శరీర బరువు వేగంగా పెరుగడం ఖాయం. దీనివల్ల ఊబకాయం చాలా త్వరగా పెరుగుతుంది. ఎందుకంటే వైట్ బ్రెడ్ కు ప్రిజర్వేటివ్స్ ను కలుపుతారు. అందుకే ఇవి అంత తొందరగా పాడవవు. కానీ ఇవి మన ఆరోగ్యానికి మంచివి కావు. ఇది కడుపుపై చెడు ప్రభావాన్ని చూపెడుతుంది. 

గుండె జబ్బుల ప్రమాదం

టీతో పాటుగా బ్రెడ్ ను తింటే గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని నిపుణులు  చెబుతున్నారు. ఎందుకంటే ఇలా తినడం వల్ల కర్తంలో చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతుంది. కొంతమందికైతే ఏకంగా గుండెపోటే రావొచ్చు. కాబట్టి టీతో బ్రెడ్ ను తినకపోవడమే మంచిది. 

బ్లడ్ షుగర్ లెవెల్స్

మధుమేహులు వైట్ బ్రెట్ ను మొత్తమే తినకపోవడమే మంచిది. అందులో టీతో పాటు దీనిని అసలే తినకూడదు. ఒకవేళ తింటే ఇన్సులిన్ పై చెడు ప్రభావం పడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. దీనివల్ల ఇతర సమస్యలు వస్తాయి. అందుకే షుగర్ పేషెంట్లు టీతో బ్రెడ్ ను ఎట్టిపరిస్థితిలో తినకూడదు. 
 

click me!