చిత్తవైకల్యం ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఈ ఆహారాలను రోజూ తినాల్సిందే..

First Published Sep 6, 2022, 9:51 AM IST

కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం తగ్గడంతో పాటుగా.. ఈ  సమస్య నుంచి కూడా బయటపడతారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 
 

చిత్తవైకల్యం సమస్య వల్ల మెదడు కణాలు క్రమ క్రమంగా నాశనమై, మెదడు అభిజ్ఞా పని తీరుపై చెడు ప్రభావం పడుతుంది. ఈ సమస్య వల్ల రోజు వారి కార్యకలాపాలను గుర్తించుకోకపోవడం, ఆలోచించకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్య ఎక్కువగా వయసు మీద పడ్డ వారిలోనే కనిపిస్తుంది. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, డయాబెటీస్, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యలు కూడా అభిజ్ఞా క్షీణతకు కారణమవుతాయి.

మంచి పోషకాహారాన్నే తినడం, మెరుగైన జీవన శైలి వల్ల మీరు పెద్దయ్యాక చిత్తవైకల్యం, అల్జీమర్స్ వ్యాధి బారిన పడే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పౌష్టికాహారం మన మొత్తం ఆరోగ్యానికి మంచిది. గుండెకు మేలు చేసే ఆహారం మెదడుకే కాక మన మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు చిత్తవైకల్యం ప్రమాదం నుంచి మిమ్మల్ని బయటపడేస్తాయని నిపుణులు చెబుతున్నారు. చిత్తవైకల్యం ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఎలాంటి  ఆహారాలను తినాలో తెలుసుకుందాం పదండి. 
 

బెర్రీలు

బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, రాస్ బెర్రీలు, చెర్రీలు మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. వీటిలో ఆంథోసైనిన్ అనే ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో రకరకాల విటమిన్లతో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 
 

nuts

గింజలు

గింజల్లో విటమిన్ బి, విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. చిత్త వైకల్యం లక్షణాలను నివారించడంలో ఈ గింజలు ఎంతో సహాయపడతాయి. వాల్ నట్స్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫైటోకెమికల్స్ మెదడు కణాల వాపును తగ్గిస్తాయని,  వృద్ధాప్యంలో మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 
 

అవిసె గింజలు

అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, జింక్, ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు, కోలిన్ వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తెలివి తేటలను అలాగే ఉంచడానికి సహాయపడతాయి. 
 

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు

సాల్మన్, అవిసె గింజలు, ఆలివ్ ఆయిల్, ట్యూనా, మాకేరెల్ వంటి కొవ్వు చేపలు కూడా మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలొ  DHA తో పాటుగా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. చిత్తవైకల్యాన్ని నివారించడంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ప్రభావవంతంగా పని చేస్తాయని ఎన్నో అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే  రోజుకు 200 మి.గ్రా డిహెచ్ఎ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 
 

click me!