మీ దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలను తినాల్సిందే..!

First Published Sep 5, 2022, 4:58 PM IST

దంతాలు దెబ్బతినకుండా.. ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని రకాల ఆహారాలు ఎంతో సహాయపడతాయి. ముఖ్యంగా కాల్షియం, ప్రోటీన్ లు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే దంతాలు బలంగా తయారవుతాయి. 
 

dental health

చాలా వరకు మన ఆరోగ్యాన్ని నిర్ణయించేవి మనం తినే ఆహారాలే. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు మనల్ని ఎన్నో రకాల రోగాల నుంచి అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. మరికొన్ని అయితే మనల్ని ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. అందుకే మనం తినే ఆహారాల్లో ఏవి మంచివి.. ఏవి కావు అనే విషయాలను తెలుసుకోవాలి. 

dental health

మన ఆరోగ్యం మన నోటి పరిశుభ్రతపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నోటిలో ఎన్నో రకాల క్రిమి కీటకాలు ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అందుకే నోటి పరిశుభ్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. నోటితో పాటుగా దంతాల ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. దంతాల ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా.. దంతాలు ఆరోగ్యంగా ఉండాలన్నా కొన్ని రకాల  ఆహారాలు ఎంతో ఉపయోగపడతాయి. అవేంటో తెలుసుకుందాం పదండి. 

చీజ్

నోటి లోపల పిహెచ్ స్థాయిని ఆరోగ్యంగా ఉంచడంలో చీజ్ సహాయపడుతుంది. ఇది దంతాలను దెబ్బతినకుండా రక్షిస్తుంది. జున్నులో ప్రోటీన్, కాల్షియం, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి దంతాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 
 

ఆకుకూరలు

ఆకు కూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఆకు కూరల్లో బచ్చలి కూర, పాల కూర లు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది పంటి ఎనామిల్ కు చాలా మంచిది.
 

apple

ఆపిల్

రోజూ ఒక ఆపిల్ పండును తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదంటారు ఆరోగ్య నిపుణులు. ఈ ఆపిల్ పండు నోటిని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిని తింటే లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. అంతేకాదు ఇది నోటి లోపల బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటుంది. ఆ పండ్లలో పుష్కలంగా ఉండే ఫైబర్ కంటెంట్ చిగుళ్ల ను ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

పెరుగు

పెరుగును కాలాలతో సంబంధం లేకుండా తినొచ్చంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే దీనిలో ఎన్నో ఔషదగుణనాలుంటాయి. వీటిలో ప్రోటీన్, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి దంతాల ఆరోగ్యానికి చాలా అవసరం. అంతేకాదు శరీరానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచడానికి సహాయపడతుంది. ఇది నోటి ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తుంది. 
 

క్యారెట్లు

క్యారెట్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా లాలాజలం ఉత్పత్తిని పెంచుతుంది. క్యారెట్లను కొద్ది మొత్తంలో రోజూ తినడం వల్ల దంతాలు దెబ్బతినకుండా ఉంటాయి. క్యారెట్లు ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి. 
 

బాదం పప్పులు

డ్రై ఫ్రూట్స్ లో ఎన్నో పోషకవిలువలుంటాయి. వీటిని తినడం వల్ల జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. ఈ పప్పుల్లో ప్రోటీన్, కాల్షియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే దంతాలను బలంగా చేస్తుంది. రోజూ కొన్ని నానబెట్టిన బాదం పలుకులకు తింటే ఎముకలు, కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. 

click me!