మధుమేహులు తిన్న తర్వాత ఈ పని చేస్తే షుగర్ అదుపులో ఉంటుంది..

Published : Sep 05, 2022, 04:08 PM IST

డయాబెటీస్ ఎన్నో కారణాల వల్ల వస్తుంది. దీనిని నియంత్రించకుంటే వీరి ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. అయితే ఈ షుగర్ పేషెంట్లు తిన్న తర్వాత ఈ చిన్న పని చేస్తే చాలు చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

PREV
17
 మధుమేహులు తిన్న తర్వాత ఈ పని చేస్తే షుగర్ అదుపులో ఉంటుంది..

ఈ రోజుల్లో చాలా చిన్న వయసు వారు కూడా షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. కానీ ఈ వ్యాధి ఒకసారి సోకిందంటే ఇక మనం చనిపోయే దాకా మనతోనే ఉంటుంది. దీనికి మనం చేయాల్సిందల్లా నియంత్రణలో ఉంచుకోవడమే. డయాబెటీస్ అనేది ఇన్సులిన్ లోపం. ఈ ఇన్సులినే మనం తిన్న ఆహారాన్ని శక్తి మార్చుతుంది. ఇక ఇది లోపిస్తే..  మన రక్తంలో గ్లూకోజ్  దారుణంగా పెరుగుతుంది. అందుకే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవడానికి కొంతమంది రెగ్యులర్ గా మెడిసిన్స్ ను తీసుకుంటూ ఉంటారు. 

27
walking

అయితే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉంటూ.. ఒత్తిడికి లోనుకాకుండా ఉంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఏవి పడితే అవి తింటే కూడా రక్తంలో విపరీతంగా చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అయితే తిన్న తర్వాత కొద్ది సేపు అటూ ఇటూ నడవడం వల్లా కూడా చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.  షుగర్ పేషెంట్లు ప్రతిరోజూ తిన్న 10 నిమిషాల తర్వాత ఒక 5 నిమిషాల పాటు నడిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

37

సాధారణంగా మనం తినే ఆహారాల్లో కార్బోహైడ్రేట్లే ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల ఉపయోగం తక్కువ. అయితే ఇవి  షుగర్ పేషెంట్లకు ఏ మాత్రం మంచివి కావు. ఎందుకంటే వీటి నుంచి వచ్చే శక్తి మన శరీరానికి ఏ విధంగానూ యూజ్ అవదు. అంతేకాదు ఇది ఒక్కోసారి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. 
 

47
walking

అందుకే తిన్న తర్వాత మీరు ఖచ్చితంగా నడవండి. తేలిక పాటి వ్యాయామాలు చేసినా.. మన శరీంలో గ్లూకోజ్ వినియోగించబడుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

57

షుగర్ పేషెంట్లు ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ముఖ్యంగా వీరి ఆరోగ్యానికి కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారం అస్సలు మంచిది కాదు. అలాగే స్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహార పదార్థాలు కూడా షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి హానికరం. గ్లైసెమిక్ ఇండెక్స్ ద్రాక్ష, అరటిపండు, పుచ్చకాయలో ఎక్కువగా ఉంటుంది. 
 

67


ఇక కార్బోహైడ్రేట్లు బంగాళాదుంపల్లో, బియ్యంలో ఎక్కువ మొత్తంలో ఉంటాయి. బ్రెడ్, కూల్ డ్రింక్స్ కూడా షుగర్ పేషెంట్లకు మంచివి కావు. అందుకే వీటిని వీరు తీసుకోకూడదు. 
 

77

మధుమేహులు షుగర్ తో చేని ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలి. అయితే స్వీట్స్ మరీ ఇష్టం ఉంటే మీరు తినే వాటిలో కేలరీలు లేకుండా చూసుకోండి. స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ ను కూడా మధుమేహులు తినకూడదు. రేగు పండ్లు, కివీలు షుగర్ పేషెంట్లకు చాలా మంచివి. 

Read more Photos on
click me!

Recommended Stories