వంధ్యత్వం పురుషులను, మహిళలను.. ఇద్దరినీ ఒకేలా ప్రభావితం చేసే సమస్య. వంధ్యత్వానికి కారణాలెన్నో ఉన్నాయి. ఈ వంధ్యత్వం చాలా మందిలో జీవనశైలి లోపాల వల్లే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం వల్ల కలిగే హార్మోన్ల హెచ్చు తగ్గులు, ఒత్తిడి, శారీరక శ్రమ లేదా వ్యాయామం లేకపోవడం వంటి అనేక కారకాలు వంధ్యత్వానికి దారితీయొచ్చు. వంధ్యత్వానికి అసలు కారణం ఏంటో తెలుసుకుని చికిత్స తీసుకోవడం మంచిది. మహిళల్లో వంధ్యత్వం నుంచి బయటపడటానికి కొన్ని రకాల ఆహారాలు సహాయపడతాయి. ఒకవేళ గర్భందాల్చడానికి సిద్దంగా ఉన్నట్టైతే మీ ఆహారంలో వీటిని ఖచ్చితంగా చేర్చుకోండి.
అత్తి పండ్లు
హార్మోన్ల సమస్యలను తగ్గించడానికి అత్తి పండ్ల ఎంతో ఉపయోగపడతాయి. పిఎస్ఒఎస్ ఉన్న మహిళలు వంధ్యత్వానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సమస్యను తగ్గించడానికి కూడా ఈ పండు మీకు సహాయపడుతుంది.
దానిమ్మ
దానిమ్మ పండ్లను తినడం వల్ల ఒక్కటేమిటీ ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ పురుషులు, మహిళల్లో వంధ్యత్వ సమస్యను పోగొట్టడానికి సహాయపడతాయి.
గింజలు
గింజల్లో ఉండే జింక్ వంధ్యత్వంతో పోరాడటానికి సహాయపడుతుంది. గింజలతో పాటుగా చిక్కుళ్ళు, చిక్పీస్, ఓట్ మీల్, పెరుగు, డార్క్ చాక్లెట్లు కూడా మీకు సహాయపడతాయి. అందుకే వీటిని తరచుగా తింటూ ఉండండి.
దాల్చినచెక్క
దాల్చిన చెక్క ఒక మసాలా దినుసు. దీనిని ఆహారంలో వేయడం వల్ల రుచి పెరుగుతుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఈ మసాలా దినుసు కూడా వంధ్యత్వానికి వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యం కలిగి ఉంటుంది. అంతేకాదు ఇది రుతుస్రావ సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
ఆవు పాలు
గేదె పాలతో పోల్చితే ఆవు పాలే మన ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తాయి. నిజానికి ఆవు పాలను తాగడం వల్ల వంధ్యత్వ సమస్య నుంచి బయటపడతారు. ఈ పాలలో ఉండే సంతృప్త కొవ్వులు గర్భందాల్చేందుకు సహాయపతాయి.