ఈ అరుదైన వ్యాధికి కారణం ఏంటి?
పెరోనీ వ్యాధి రావడానికి నిర్ధిష్ట కారణమంటూ ఏమీ లేదు. అయితే పురుషాంగంలో ఫలకం ఏర్పడటం వల్ల ఈ వ్యాధి బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు.
పెరోనీ వ్యాధి సాధారణంగా పురుషాంగానికి తరచుగా గాయం అయితే వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. సెక్స్, అథ్లెటిక్ యాక్టివిటీ, ప్రమాదాలు తరచుగా జరిగినప్పుడు పురుషాంగం దెబ్బతినొచ్చు. ఏదేమైనా పురుషాంగానికి ఏ గాయం అయినా తొందరగా గుర్తింబడదని మాయో క్లీనిక్ చెప్తోంది.