పొట్ట బాగా పెరిగిందా? ఇదిగో వీటిని తినండి వెన్నలా కరిగిపోతుంది..

First Published | Nov 4, 2022, 12:58 PM IST

బెల్లీ ఫ్యాట్ కరగాలంటే మీరు తినే ఆహారంలో కేలరీలు లేకుండా చేసుకోవాలి. ముఖ్యంగా కార్భోహైడ్రేట్లు, కొవ్వు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. అప్పుడే మీ పొట్ట ఫాస్ట్ గా కరిగిపోతుంది.  
 

belly fat

ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో బెల్లీ ఫ్యాట్ ఒకటి. పొట్టచుట్టూ పేరుకుపోయిన కొవ్వు ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే బెల్లీ ఫ్యాట్ ను వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాలను తింటూ.. ప్రతిరోజూ వ్యాయామం చేస్తే బెల్లీ ఫ్యాట్ తొందరగా కరిగిపోతుంది. 

బెల్లీ ఫ్యాట్ కరగాలంటే కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలనే తినాలి. ముఖ్యంగా కొవ్వు, కార్బోహైడ్రేట్లు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను అసలే తినకూడదు. బెల్లీ ఫ్యాట్ కరిగేందుకు మీరు తినే ఆహారంలో ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చేసుకోవాలి. ఇవి బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. అవేంటంటే.. 

బ్లూబెర్రీలు

బ్లూబెర్రీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బ్లూబెర్రీలతో పాటుగా బ్లాక్ బెర్రీలు, స్ట్రాబెర్రీలు కూడా బరువు తగ్గడానికి సహాయపడతాయి. వీటిలో పీచుపదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా బ్లూబెర్రీలు కొవ్వును కరిగించడానికి ఎంతో సహాయపడతాయి. 
 


నిమ్మకాయ నీరు

రెగ్యులర్ గా ఉదయం పరిగడుపున నిమ్మకాయ నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిది. ఈ పానీయం శరీరంలోని కేలరీల మొత్తాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చేయడానికి కూడా సహాయపడుతుంది.
 

tea

గ్రీన్ టీ

గ్రీన్ టీ యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం. ఇది మీ శరీర కొవ్వును తగ్గించడానికి, బరువును నియంత్రించడానికి సహాయపడుతుంది. పలు అధ్యయనాల ప్రకారం.. గ్రీన్ టీ తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. వేగంగా బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. 
 

బచ్చలికూర

ప్రోటీన్ ఎక్కువగా ఉండే కూరగాయల్లో బచ్చలికూర ఒకటి. అరకప్పు బచ్చలికూరలో ఒక గ్రాము ప్రోటీన్ ఉంటుంది. బచ్చలికూరలో జింక్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటాయి. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి, రక్తపోటును తగ్గించడానికి, కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి  బచ్చలికూర ఎంతో సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఎర్ర బచ్చలికూర జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.  అంతేకాదు ఇది కొవ్వును తగ్గిస్తుంది. దీంతో మీ శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. 

పప్పుధాన్యాలు

పప్పుధాన్యాల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి.  కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలకు బదులుగా పప్పు ధాన్యాలను తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ తొందరగా తగ్గిపోతుంది. 
 

banana


అరటిపండ్లు

అరటి పండ్లు కూడా బరువు తగ్గడానికి, బెల్లీ ఫ్యాట్ కరగడానికి సహాయపడాయి. అరటిపండ్లు తింటే ఆకలి కోరికలు చాలా వరకు తగ్గుతాయి. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ  కడుపు నిండుగా ఉంచేందుకు సహాయపడుతుంది. అరటిపండ్లలో ఉండే పొటాషియం కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. అంతేకాదు జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చేయడానికి సహాయపడుతుంది. శరీరంలో మంచి బ్యాక్టీరియా పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది అదనపు కేలరీలను కూడా బర్న్ చేస్తుంది. పొటాషియం అధికంగా ఉండే అరటిపండ్లు రక్తపోటును తగ్గించడానికి కూడా సహాయపడతాయి.
 

అల్లం టీ: అల్లం టీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడం నుంచి ఎన్నో సమస్యలను తగ్గిస్తాయి. మీరు తాగే టీ కి అల్లాన్ని జోడిస్తే.. బొడ్డు కొవ్వు తగ్గించడానికి సహాయపడుతుంది. 

పెరుగు:  పెరుగును తింటే జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. అంతేకాదు ఇది ఎన్నో ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది కూడా. రోజూ కప్పు పెరుగును తింటే బెల్లీ ఫ్యాట్ తొందరగా కరుగుతుందని పలు అధ్యయనాలు కూడా వెల్లడించాయి. 

Latest Videos

click me!