జలుబు, తుమ్ములతో బాధపడుతున్నారా.. ఇదిగో పరిష్కారం..!

Published : Sep 05, 2022, 03:20 PM IST

సరైన ఆహారం తీసుకోవడం నుండి వర్షాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా..  సీజన్‌లో అవసరమైన నివారణ చర్యలు కూడా తీసుకోవాలి.

PREV
17
 జలుబు, తుమ్ములతో బాధపడుతున్నారా.. ఇదిగో పరిష్కారం..!
sneezing

వాతావరణంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. రుతుపవనాలు కూడా కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎక్కువగా అందరిపై సీజనల్ వ్యాధులు ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, తుమ్ములు ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. 

27
Coronavirus women Sneezing

ఒక్కసారి వచ్చాయంటే.. ఒక పట్టాన వదిలిపెట్టవు. వాటి కారణంగా ఇతర ఆరోగ్యసమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
అందువల్ల, మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ రక్షించుకోవడం చాలా ముఖ్యం. సరైన ఆహారం తీసుకోవడం నుండి వర్షాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా..  సీజన్‌లో అవసరమైన నివారణ చర్యలు కూడా తీసుకోవాలి.

37

ఒక్కోసారి మనం అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అనారోగ్యానికి గురౌతూ ఉంటాం. అది దగ్గు, జలుబు, జ్వరానికి దారితీయవచ్చు. ఇది వైరల్ జ్వరం లేదా ఒక రకమైన ఇన్ఫెక్షన్ లేదా అలెర్జీ కావచ్చు. పరిస్థితిని తగ్గించడానికి సహాయపడే మందులను సూచించే మీ వైద్యుడిని మీరు సంప్రదించవచ్చు. దానితో పాటు, మీరు మీ జలుబు,  తుమ్ములను నియంత్రించడానికి ఈ ఇంటి చిట్కాలను కూడా ఉపయోగించవచ్చు.

47

sneezing man

అల్లం, తులసి: ఈ రెండు పదార్థాలు మీకు జలుబు, తుమ్ముల  నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. మీరు వాటిని మీ టీలో చేర్చవచ్చు లేదా వాటిని ఉడకబెట్టి.. ఆ రసం తీసుకోవచ్చు. ఈ రసం తాగడం వల్ల.. జలుబు, ముక్కు పట్టేయడం వంటి సమస్యల నుంచి సత్వర పరిష్కారం లభిస్తుంది.

57

నల్ల ఏలకులు: మీరు నిరంతరం తుమ్ముతున్నప్పుడు నల్ల ఏలకులను నమలండి. ఇలా చేయడం వల్ల తుమ్ములు ఆపడానికి, ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది. ఈ మసాలా నుండి స్రవించే నూనె మీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

67
sneeze

పసుపు: పసుపు ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మీరు దానిని గోరువెచ్చని పాలలో వేసి త్రాగవచ్చు. ఇలా తాగడం వల్ల ముక్కు బ్లాక్ అయినప్పుడు రిలీజ్ అవ్వడానికి సహాయం చేయడంతో పాటు...  తుమ్ములను కూడా ఆపడానికి సహాయపడుతుంది.

77

తేనె: మరొక అత్యంత ప్రభావవంతమైన పదార్ధం తేనె. మీరు దానిని మీ టీ లేదా గోరువెచ్చని నీటిలో వేసి త్రాగవచ్చు. ఇది తుమ్ముల నుండి మీకు ఉపశమనాన్ని అందించడానికి సహాయం చేస్తుంది.

click me!

Recommended Stories