Sleep: ఈ ఆహారమే మీ బంగారు నిద్రకు భంగం కలిగించేది..

First Published Jan 24, 2022, 11:02 AM IST


Sleep: కంటినిండా నిద్ర ఉంటేనే సకల రోగాల నుంచి తప్పించుకోగలం. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపగలం. అయితే ప్రస్తుత కాలంలో చాలా మందికి నిద్ర కరువైంది. నిద్రలేమి సమస్యలతో సతమతమవుతూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మీకు తెలియని విషయం ఏమిటంటే.. మనం తీసుకునే ఆహారమే మనకు నిద్రను లేకుండా చేస్తుందనేది. 

sleep


Sleep: ఆరోగ్యకరమైన జీవితానికి బలమైన, పోషకవిలువలుండే ఆహారం ఎంతో అవసరం. మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. సమయానికి తగ్గట్టుగా సరైన ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. అందుకే పొద్దున్న బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ లో సరైన డైట్ విధానాన్ని పాటించాలి. కానీ వాటిని పాటించే వారు చాలా తక్కువ మందే ఉన్నారు. అందుకే ప్రస్తుత కాలంలో ఇన్ని రోగాల బారిన పడుతున్నాం. అయితే మనకు తెలియని విషయం ఏమిటంటే.. మనం తీసుకునే ఆహారానికి, నిద్ర కు సంబంధం ఉందనే విషయం. అవును మనం తీసుకునే ఫుడ్ యే మన నిద్రకు భంగం కలిగిస్తుంది. మరి మీ నిద్రకు ఎలాంటి ఆహారం భంగం కలిగిస్తుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

మనం తీసుకునే రకరకాల ఆహారం మన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇవన్నీ మన బరువు, పేగు ఆరోగ్యం, నిద్ర వంటి వాటిపై చాలా ప్రభావం చూపిస్తాయి. అందులో డిన్నర్ చాలా ముఖ్యమైనది. అందుకే డిన్నర్ ను మిస్ చేయకూడదు. అందులోనూ రాత్రి సమయంలో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్నే తీసుకోవాలి. ఇలా చేస్తే గ్యాస్, యాసిడ్ రీఫ్లక్స్, కడుపునొప్పి వంటి సమస్యలు రావు. తద్వారా నిద్ర బాగా పడుతుంది. 
 

ముఖ్యంగా రాత్రి సమయంలో ఎక్కువ ఫ్యాట్ ఉంటే ఆహారాన్ని అస్సలు తినకూడదు. ఎందుకంటే అది జీర్ణమవడానికి చాలా సమయం తీసుకుంటుంది. అంతేకాదు ఉదర సంబంధ సమస్యలు వచ్చి సరిగ్గా నిద్రపోలేరు. దానికి తోడు ఆ ఆహారం ఫ్యాట్ గా మారి మీరు శరీర బరువు పెరిగే ప్రమాదం కూడా పొంచి ఉంది.
 

Fried food

రాత్రి సమయంలో ఫ్రైడ్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఫుడ్ లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉప్పు , ప్రోటీన్లు మోతాదుకు మించి ఉంటాయి. దీంతో జీర్ణం ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఆ ఆహారం నెమ్మదిగా అరుగుతుంది. ఇది కాస్త మీ నిద్రపై ప్రభావం పడుతుంది. 
 

స్పైసీ ఫుడ్ కూడా నిద్రకు భంగం కలిగిస్తాయి. దీన్ని రాత్రి సమయంలో తినడం వల్ల యాసిడ్, గుండెలో మంట ఏర్పడే అవకావం ఉంది. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వారు ఈ స్పైసీ ఫుడ్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

పడుకునే సమయంలో హై ప్రోటీన్ ఆహారం కూడా మన నిద్రపై తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది. ఎందుకంటే పడుకునే టైం లో ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే త్వరగా జీర్ణం అవడం కష్టం. దీనివల్ల రాత్రంగా కడుపు అసాధారణంగా అనిపిస్తూ ఉంటుంది. దీంతో మీకు నిద్ర ఉండదు.  
 


షుగర్ కూడా మీ నిద్రకు భంగం కలిగించే అంశమే. ఎందుకంటే డిన్నర్ లో స్వీట్ ఐటెమ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. తద్వారా ఇన్సులిన్ సమతుల్యంలో మార్పులు వస్తాయి. ఇది కాస్త మధుమేహం ఉన్నవారికి ప్రమాదకరంగా మారుతుంది. అందులోనూ స్వీట్ ను రాత్రుళ్లు తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు.. ఈ ఫుడ్ తీసుకుంటే జీర్ణం నెమ్మదిగా అవుతుంది. 

click me!