మీకు తెలుసా.. ఇవి తింటే జుట్టు అస్సలు ఊడిపోదట..

First Published Jan 24, 2022, 10:03 AM IST

Hair Growth Tips: జుట్టు రాలుతుందని తెలిస్తే చాలు తెగ కంగారు పడిపోయి.. మార్కెట్ లో లభించే వివిధ హెయిర్ ఆయిల్, రకరకాల చిట్కాలను పాటిస్తూ జుట్టు సంరక్షణ చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయితే హెయిర్ ఫాల్ జరగకుండా ఉండాలంటే ఈ వీటితో పాటుగా బలమైన ఆహారం కూడా తీసుకోవాలనే ముచ్చట మీకు తెలుసా.. అవును కూరగాయలతో కూడా జుట్టు బలంగా, దట్టంగా ఉంటుంది.
 

hair falling

Hair Growth Tips: ఒత్తైన, పొడవైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం చాలా సహజం. అయితే ఆ జుట్టు కోసం తీసుకునే జాగ్రత్తలు, సంరక్షణ చర్యలు తీసుకునే వారు చాలా తక్కువ. అందుకే చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యను ఎదుర్కొంటున్నారు. అందులోనూ యువతీ యువకులు కూడా ఈ హెయిర్ ఫాల్ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడటానికి హెయిర్ ప్యాక్ లు, మాస్కులనే ఎక్కువగా వాడుతుంటారు. మీకు తెలియని విషయం ఏమిటంటే.. కూరగాయలు కూడా జుట్టును ఊడిపోకుండా చేసి, ఒత్తుగా, బలంగా చేస్తాయి. ఇలాంటి ఆహారాన్ని మీ రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే మీ కేశాలు పొడుగ్గా, దట్టంగా మారతాయి. అలాగే వీటి ద్వారా చక్కటి ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఇందుకు ఎలాంటి కూరగాయలు తినాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
 

క్యారెట్ హెయిర్ ఫాల్ సమస్యను దూరం చేసి.. వెంట్రుకలను బలంగా చేయడంలో ముందుంటుంది. ఈ క్యారెట్ లో విటమిన్ బీ 7 ఉంటుంది. ఇది కేశాలు ఆరోగ్యంగా, బలంగా ఉండేలా సహాయపడుతుంది. అందుకే మీ రోజు వారి ఆహారంలో క్యారెట్ తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. అయితే ఈ క్యారెట్ తో హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే జుట్టు నిగనిగ మెరిసిపోవడంతో పాటుగా హెయిర్ ఫాల్ సమస్యను కూడా తరిమికొట్టొచ్చు. హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలంటే.. క్యారెట్ ను ఉడకబెట్టి దాన్ని పేస్ట్ లా తయారుచేసి పెట్టుకోవాలి. ఆ పేస్ట్ ను జుట్టుకు ప్యాక్ లా వేసుకోవాలి. దాన్ని ఒక అరగంట పాటు వదిలేసి.. ఆ తర్వాత నీట్ గా శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల వెంట్రుకలు ఊడిపోకుండా చేయడంతో పాటుగా.. జుట్టు బలంగా మారుతుంది. 
 

పాలకూర.. జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఐరన్ లోపమే. అందుకే ఐరన్ పుష్కలంగా లభించే ఫుడ్ ను తీసుకోవాలి. కాగా పాలకూరలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ముఖ్యంగా ఈ ఆకుకూరలో జింక్, ఐరన్, పీచుపదార్థం, విటమిన్లు దండిగా లభిస్తాయి. ఇవన్నీ కేశాలను అందంగా, పొగవుగా, దట్టంగా పెరిగేలా చేయడంలో ముందుంటాయి. 
 

ఉల్లిగడ్డ.. ప్రతి వంటకాల్లో ఉల్లిపాయ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇది లేనిదే కూర కూడా కాదు. అందుకే ప్రతిరోజూ ఉల్లిగడ్డను వంటల్లో వేస్తూ తింటూ ఉంటాం. ఈ ఉల్లిగడ్డలో ఐరన్, బయోటిన్, జింక్, వివిధ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి జుట్టును ఊడిపోకుండా చేయడంతో పాటుగా వెంట్రుకలను బలంగా, నల్లగా నిగనిగమెరిసిపోయేలా చేస్తాయి. అందుకే ఉల్లిగడ్డను ప్రతిరోజూ మీ వంటకంలో తీసుకోవాలి.
 

టమాటా.. పాలిపోయిన జుట్టును నిగనిగలాడేలా చేయడంలో టమాటా ముందుంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. ఇది జీవం కోల్పోయిన జుట్టుకు తిరిగి ప్రాణం పోస్తుంది. అంతేకాదు జుట్టు పై పేరుకుపోయిన మలినాలను, జిడ్డును, టాక్సిన్లను తొలగించడంలో టొమాటో బాగా సహాయపడుతుంది. అలాగే జుట్టును కాంతివంతంగా మెరిసిపోయేలా చేయడంలో టొమాటో ఉపయోగపడుతుంది. అయితే ఈ టొమాటో గుజ్జును హెయిర్ కు ప్యాక్ లా వేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. అందుకే మీ రోజు వారి ఆహారంలో టొమాటోను భాగం చేసుకోండి. 

చిలగడదుంప..  చికగడదుంప కూడా కేశ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో బీటాకెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. దీని తింటే మన శరీరంలోకి వెళ్లి అది విటమిన్ ఎ గా మారుతుంది. అదికాస్త వెంట్రుకలు రాలిపోకుండా, కాంతివంతంగా మెరిసిపోయేలా చేస్తుంది. ఈ చిలగడదుంప కురుల సంరక్షణకే కాదు మెరుగైన ఆరోగ్యానికి కూడా బాగా సహాయపడుతుంది.   

click me!