Health: కరోనా పుణ్యమా అని జనాలంతా మెరుగైన ఆహారం వైపు మొగ్గుచూపుతున్నారు. ఏ ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మందిచి? ఏయే ఆహార పదార్థాలతో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందో అలాంటి ఆహారాలకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. వాటినే తినడం అలవాటు చేసుకుంటున్నారు. అందులోనూ బలమైన ఆహారమే కరోనాకు విరుగుడు అని నిపుణులు చెప్పడంతో వాటినే ఎక్కువగాతింటున్నారు. ఇలాంటి ఆహార పదార్థాల్లో వెల్లుల్లి కూడా ఒకటి. ఈ వెల్లుల్లిలో కాల్షియం, పొటాషియం, కాపర్, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ బీ1 వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. అందుకే ప్రతి వంటలో వెల్లుల్లిని ఖచ్చితంగా వాడుతున్నారు.