
Melt Fat : శరీరానికి సరిపడా ఆహారం తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అదే అవసరం కంటే తక్కువ తీసుకున్నా.. ఎక్కువ తీసుకున్నా ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోకతప్పదు. అంతేకాదు శరీరంలో అనవసరంగా కొవ్వులు చేరుతాయి. దీనివల్ల శరీర బరువు పెరగడంతో పాటుగా ఊబకాయం బారిన పడే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా శరీరంలో పేరుకుపోయిన కొవ్వులను వీలైనంత తొందరగా కరిగించుకోకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శరీరంలో పేరుకుపోయిన కొవ్వులను కరిగించడంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు ఎంతో సహాయపడతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే అతికొద్ది సమయంలోనే మీ ఫ్యాట్ ను కరిగించుకోవచ్చు. కొవ్వును కరిగించడానికి ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పచ్చిమిరపకాయలు: పచ్చిమిరపకాయల్లో క్యాప్సైసిన్ అనే పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక కేలరీలను కరిగించడంలో ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు ఇది శరీర ఎదుగుదలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే మీ వంటకంలో పచ్చి మిర్చి ఉండేలా చూసుకోండి.
ఆపిల్: రోజుకో ఆపిల్ కాయను తినడం వల్ల మీ ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం రాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల డాక్టర్ అవసరం కూడా లేదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ పండ్లల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగించడానికి ఎంతగానో సహాయపడతాయి.
డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్ లో ఉండే ఫ్లవనాయిడ్స్ మన శరీరంలో అధికంగా ఉండే ఫ్యాట్ ను తగ్గిస్తుంది. అంతేకాదు ఇది మన రక్తంలోని సెరోటోనిన్ పెరుగుదలకు ఎంతగానో సహాయపడుతుంది.
వెల్లుల్లి: వెల్లుల్లిలో ఆలిసిన్ అనే రసాయనం మెండుగా ఉంటుంది. ఇది యాంటీ బాక్టీరియాగా పనిచేసి మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాన్ ను తగ్గిస్తుంది. అంతేకాదు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును సైతం కరిగించడంలో సహాయకారిగా పనిచేస్తుంది.
టమాటో: టమాటోలు క్యాన్సన్ కణాలను నాశనం చేసే గుణం కలిగి ఉంటాయి. అంతేకాదు ఇవి కొవ్వును కరిగించడంలో ముందుంటాయి. అందుకే ప్రతిరోజూ వీటిని మీ ఆహారంలో చేర్చుకోండి.
గ్రీన్ టీ: బరువు తగ్గేందుకు ప్రయత్నించే వారికి గ్రీన్ టీ దివ్య ఔషదంలా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ టీని ఒక క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. కాగా ప్రతి రోజూ రెండు కప్పుల గ్రీన్ టీ ని తాగితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.
తేనె: తేనె కూడా కొవ్వును కరిగించడంలో ముందుంటుంది. ప్రతి రోజూ పరిగడుపునే గోరువెచ్చని నీళ్లలో కాస్త తేనె కలుపుకునిన తాగితే.. కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.
గుడ్లు: గుడ్లలో ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ముఖ్యంగా వీటిలో కేలరీలు చాలా తక్కువ శాతం ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతిరోజూ తీసుకుంటే కొలెస్ట్రాల్ ను తగ్గడం పక్కాగా జరుగుతుంది. అంతేకాదు ఉడకబెట్టిన గుడ్డును తినడం వల్ల కండరాలు బలంగా మారుతాయి.