ఒకరిని కౌగిలించుకోవడం శక్తిని బదిలీ చేయడమే కాకుండా వారికి భావోద్వేగ ప్రోత్సాహాన్ని అందిస్తుంది, అంతేకాదు ఇది ఆరోగ్యానికి గణనీయమైన ప్రయోజనాన్ని కూడా ఇస్తుంది. అధ్యయనాల ప్రకారం, హగ్ ఒత్తిడిని తగ్గిస్తాయి, విశ్వాసాన్ని పెంచుతాయి, సంబంధాలను బలోపేతం చేస్తాయి. ఈ హగ్ డే నాడు (Happy Hug Day) ప్రియురాలిని కలవగానే... వెంటనే కౌగలించేసుకోకుండా, ముందుగా ఆమెతో ప్రేమగా మాట్లాడాలి. ఆ తర్వాత హ్యాపీ హగ్ డే ప్రాధాన్యాన్ని ఆమెకు వివరించి... ఆమె సమ్మతితో హగ్ ఇవ్వాలి.